* కులాలను ….పెత్తందార్లను.. అవినీతి పరులను… పారదోలి నిజాయితీగా విధులు నిర్వహించటం ఆయన చేసిన తప్పా అంటూ కనిగిరి ప్రజాసంఘాలు రోడ్డెక్కారు ప్రభుత్వం అవినీతి రహిత గా పాలిస్తామని చెప్పిన ప్రభుత్వం, దానికి కట్టుబడి పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు తన సర్వీసులో .తను చేసిన కార్యాలయాల్లో ఎక్కడైనా ఇన్ని సంవత్సరాల్లో తనపై అవినీతి ఆరోపణ చూపించగలరని ప్రశ్నించారు ఇలాంటి ఉత్తమ అధికారులను మా ప్రజాసంఘంలా పోరాటంలో నేనెప్పుడూ చూడలేదు వినలేదని అన్నారు క్కడి కప్పలు ఇంటిలిజెన్ ఒంగోలు ఎసిబిలో పనిచేసిన ఆయన గురించి తెలియాలంటే ఆయనతో పాటు చేసిన వారిని అడిగి తెలుసుకోండని ఆయన నిజాయితీ ఏమిటో తెలుస్తుందని తెలిపారు . నిగిరి c.i కోసం ఆటో డ్రైవర్లు. వ్యాపారస్తులు. ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా రోడ్డెక్కి నిలబడటం ఆయన నిజాయితీకి నాంది పలికాయని తెలిజేశారు ఇలాంటి ఉత్తమ నిజాయితీ అధికారుల కోసం ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని ఇది గుర్తుంచుకోవాలని . ప్రజాప్రతినిధులకు గుర్తుచేశారు.
* కుటుంబకలహాలతో విసిగిన ఓ మహిళ కన్నపిల్లల్ని కత్తితో పొడిచి చంపడంతో పాటు తనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేట గ్రామశివారు శివబిక్యాతండాలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది.
* కన్నకొడుకే యముడయ్యాడు. తల్లిదండ్రులను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియం గ్రామానికి చెందిన రమేష్.. తల్లిదండ్రులపై దాడి చేశారు. రాడ్డుతో కొట్టి హతమార్చాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ కోసం గాలిస్తున్నారు.
* మధ్యప్రదేశ్‌లోని నైవారి జిల్లా ఓర్చా పట్టణ సమీపంలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
* వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో ఉన్న మహాతేజ రైస్‌మిల్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి – అద్దంకి రహదారిపై వేగంగా వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది.
* అంబర్‌పేటలోని బాపునగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపులు భరించలేక మొబీన్ బేగం అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
* శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు.
* అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన మల్యాల మండలంలోని ముత్యంపేటలో చోటుచేసుకుంది. తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళనలో పరుగులు తీశారు. సుమారు 20 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మల్యాల ఆస్పత్రికి తరలించారు.
* సంగారెడ్డి జిల్లాలోని కందిలో గల ఐఐటీ హైదరాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు.
* చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం నకు అనంతపురం వాసి సతీష్ కొండ వాలు ప్రాంతములో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేసి .. సుమారు 30 అడుగుల లోతున లోయలో పడి పోయాడు
* గుంటూరు జిల్లావినుకొండ మండలం లోని చీకటీగలపాలెం హై వే పై జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన తంబళ హరీష్.
* హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహం నుంచి దూకి బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సిద్దార్థ ప్రాణాలు తీసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* బీహార్ రాష్ట్రంలోని షియోహర్ పట్టణంలోని యూకో బ్యాంకులో భారీ చోరీ జరిగింది.
* కులాలను ….పెత్తందార్లను.. అవినీతి పరులను… పారదోలి నిజాయితీగా విధులు నిర్వహించటం ఆయన చేసిన తప్పా అంటూ కనిగిరి ప్రజాసంఘాలు రోడ్డెక్కారు ప్రభుత్వం అవినీతి రహిత గా పాలిస్తామని చెప్పిన ప్రభుత్వం, దానికి కట్టుబడి పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు
* ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులొ పోలం లో కలుపు తీస్తున్న రైతు కొంగర సాంబయ్య వయస్సు55సం మృతి
పాము కాటా లేక గుండెపోట అనేది వివరాలు తెలియ్యాలిసి ఉందిn
* పెండ్లి అయిన నాలుగు నెలలకే విభేదాలు పగతో అత్తింటికి కన్నంవేసిన కోడలు తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బంగారు నగలు, వెండి అపహరణ నలుగురు అరెస్ట్, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి స్వాధీనం
* వినుకొండ మండలం లోని చీకటీగలపాలెం హై వే పై జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన తంబళ హరీష్.
ఇతను వినుకొండ పట్టణం లోని నిమ్మలబావి బజారుకు చెందిన తంబళ సాంబయ్య కుమారుడు అని, తాపీ పని నిమిత్తం చీకటీగలపాలెం రాగ ప్రమాధం జరిగిందని స్థానికుల సమాచారం
* గుంటూరు జిల్లా నకరికల్లు మండల కేంద్రము నకరికల్లు శివారు గ్రామము శ్రీరాంపురం వద్ద ఆదివారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు.
* దంతెవాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు.
మృతులంతా విశాఖ వాసులని.. నిమ్స్ ఆసుపత్రి డాక్టర్ సునీత కుటుంబంగా పోలీసులు గుర్తించారు. విశాఖ నుంచి దంతెవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
*బాగ్దదిపై దాడి చేసిన శునకానికి ప్రశంసల జల్లు
* అతను ఓ విశ్రాంత పోలీస్ అధికారి. కుమారుడికి మగ సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కొడుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి అద్దెగర్భంతో తానే ఓ కుమారుడిని కన్నాడు. ఇప్పుడు అతనే తన వారసుడని తేల్చిచెబుతున్నాడు. మొదటి కొడుకుని తన బిడ్డే కాదంటున్నాడు. భార్యాబిడ్డలను వదిలేసి తన వద్దకు వస్తేనే ఆస్తిలో వాటా ఇస్తానని చెబుతున్నాడు. తండ్రి తీరుతో మనస్తాపం చెందిన కుమారుడు న్యాయం కోసం ‘స్పందన’ లో ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేశారు.
* పాకిస్థాన్ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) సుతిమెత్తగా హెచ్చరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాక్ నిరాకరించడాన్ని తప్పుపట్టింది. చికాగో కన్వెన్షన్ నిబంధనలు జాతీయ నాయకులు ప్రయాణించే విమానాలకు వర్తించవని స్పష్టం చేసింది.
*బీహార్ రాష్ట్రంలోని షియోహర్ పట్టణంలోని యూకో బ్యాంకులో భారీ చోరీ జరిగింది. షియోహర్ పట్టణంలోని యూకో బ్యాంకులో కొందరు ముసుగులు ధరించిన దొంగలు తుపాకులతో వచ్చి బ్యాంకులో నుంచి రూ.32 లక్షలను దోచుకెళ్లారు
*మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. పొన్నాల ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది. జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్ 45 సిగ్నల్ వద్ద ఈ ఘటన జరిగింది.
*సికింద్రాబాద్ పరిధి బోయిన్పల్లిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.. వడ్డీవ్యాపారి సరళ ఇంట్లో చోరీ చేసింది స్వయానా ఆమె కోడలు సుప్రియేనని నిర్ధారించారు.
*బుడి బుడి అడుగులు వేస్తున్న ప్రాయం. అమ్మ, నాన్న తప్ప మరో ప్రపంచం తెలియదు. ఆ చిన్నారి ఆడుకుంటూ అనుకోకుండా ఈ నెల 25న బోరుబావిలో పడ్డాడు.
*రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే కడతేర్చిందో కర్కశ పుత్రిక. చెడు అలవాట్లు మానుకోవాలని కూతురికి చెప్పడమే ఆ తల్లి పాలిట శాపమైంది
*జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి క్రూరంగా తన ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేసింది. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది.
*ఖైరతాబాద్ మారుతీనగర్లోని ఓ భవనం పైనున్న సెల్టవర్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి రెండు సెల్టవర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
*షైన్ పిల్లల ఆస్పత్రిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై న్యాయస్థానం ఆక్షేపణ తెలిపింది.
*విద్యార్థిపై దాడి చేసినందుకు ఓ కళాశాల ప్రిన్సిపల్పై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
*విద్యుదాఘాతంతో బడి ఆవరణలో విద్యార్థి మృతి ఘటనకు బాధ్యులను చేస్తూ అధికారులు ముగ్గురు ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు.
*నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం ప్రధాన కాల్వలోకి ఓ కారు దూసుకెళ్లి.. ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దస్తురాబాద్ మండలం రేవోజిపేట గ్రామ సమీపంలోని కాల్వ వద్ద శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పలిమెల-పంకెన గోదావరి సమీపాన సుంకరెల్లి ప్రాంతంలో మహారాష్ట్ర పశువుల కాపరులు 12 మంది…పశువులతో సహా గోదావరిలో చిక్కుకున్నారు.
*గుండెపోటుతో మరణించిన బావ మృతదేహాన్ని అంబులెన్స్లో తరలిస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు దుర్మరణం చెందా రు. ఈ విషాద సంఘటన సిద్దిపేట శివారులో శనివారం చోటుచేసుకున్నది.
*బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించకుండానే గుత్తేదారులు నిధులు స్వాహా చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. బోగస్ బయోగ్యాస్ యూనిట్లపై సీఐడీ అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టడంతో ఈ బాగోతం బయటపడింది.
*మనస్పర్థలతో భర్తకు దూరంగా ఉంటున్న ఓ వివాహిత.. కుటుంబ కలహాలతో మాతృత్వాన్ని మరిచి తన కుమారుడిని చంపుకుంది.
*నెలకు రూ.70 వేల జీతం.. గౌరవప్రదమైన ఉద్యోగం ఉన్నప్పటికీ జల్సాల కోసం దొంగగా మారాడో ఇంజినీరు. ఉద్యోగం చేస్తూనే.. మూడు దొంగతనాలు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు.
*ముంగేలిలో జైలు నుంచి నలుగురు ఖైదీలు తప్పించుకు పారిపోయారు. అర్థరాత్రి కారాగారం గోడ దూకి ఖైదీలు పరారయ్యారు.
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో దారుణం జరిగింది. తల్లిదండ్రులకు తమ కుమారుడే రాడ్ తో కొట్టి చంపి పరారయ్యాడు. మానసిక పరిస్థితి సరిగా లేని కుమారుడు తల్లిదండ్రులను హత్యచేశాడు. కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని భర్త జాలపర్తి రమేష్ (28)ను భార్య వదిలి వెళ్లింది. నాగేశ్వరరావు, మార్తలను ఇనుప రాడ్ తో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేకలు విని ఇరుగుపొరుగు వారు రావడంతో కుమారుడు రమేష్ పరారయ్యాడు.
సిఐ బదిలీకి నిరసనగా రోడ్డెక్కిన ప్రజలు-నేరవార్తలు-10/29
Related tags :