సార్వత్రికి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనను చేరమని అడిగిన మాట వాస్తవమేనన్నారు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి. అయితే ఇప్పుడు తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. వైసీపీలో దగ్గబాటి వెంకటేశ్వరరావు చేరడానికి ముందే… తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశానని చెప్పారామె. అందుకు వైసీపీ నేతలు కూడా అంగీకరించారని తెలిపారు పురంధరేశ్వరి. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే… బీజేపీలోని ఉన్న పురంధేశ్వరి కూడా పార్టీలోకి రావాలని సీఎం జగన్ దగ్గుబాటి కుటుంబానికి షరతు విధించినట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో దగ్గుబాటి వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని దీనిపై వైసీపీ ముఖ్య నేతలకు ఫోన్లోనే తన నిర్ణయాన్ని చెప్పినట్టు సమాచారం. ఇకపై ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని దగ్గుబాటి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ వ్యవహారాలపై స్పందించని పురందేశ్వరి తొలిసారి ఇలా క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావునే అడగండి అని వ్యాఖ్యానించారు పురంధేశ్వరి.
ఎన్నికలకు ముందు అడిగిన మాట వాస్తవమే
Related tags :