జల్లికట్టు ఉత్సవాలకు రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ హాజరవుతున్నట్లు సమాచారం. 2020 జనవరిలో తమిళనాడు మధురైజిల్లాలోని అలంగనల్లూర్ ప్రాంతంలో జరిగే జల్లికట్టు ఉత్సవాలను పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వీక్షిస్తారని సమాచారం. దీని గురించి అలంగనల్లూర్ ప్రభుత్వాధికారులను సంప్రదించగా దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదని వారు వివరించారు. జల్లికట్టు ఉత్సవాలను తమిళనాడు ప్రజలు ఎంతో వేడుకగా , సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ క్రీడలో ప్రధానంగా ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ ఆట వల్ల ఎద్దులను హింసిస్తున్నరంటూ జంతు ప్రేమికులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సుప్రీం కోర్టు ఈ ఆటను నిషేధించాలంటూ 2016లో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ ఆట గురించి తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ క్రీడను యథావిధిగా కొనసాగించేందుకు కోర్టు నుంచి ఆర్డర్‌ను తీసుకుని వచ్చింది. అప్పటి నుంచి ఆట కొనసాగుతుంది.
జల్లికట్టుకు పుతిన్
Related tags :