1.ఇసుక సంక్షోభం మానవ తప్పిదమే: చంద్రబాబు
ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు ‘జగన్ మాయ’లా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని తేల్చిచెప్పారు. వైకాపా నేతల స్వార్థానికి రోజువారీ కూలీలు బలి అవుతున్నారని మండిపడ్డారు. సొంత ఊళ్లలోని వాగుల్లో ఇసుక తెచ్చుకోవడానికి అనేక అడ్డంకులు సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని దుయ్యబట్టారు.
2. అధికారులతో కేసీఆర్ అత్యవసర సమావేశం
ర్టీసీ సమ్మె వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నం హై కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు, అడ్వకేట్ జనరల్‌తో సీఎం చర్చిస్తున్నారు. కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను ఇవాళ మధ్యాహ్నం అడ్వకేట్ జనరల్ కోర్టులో వినిపించనున్నారు.
3. గుంటూరు చేరుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం
వైకాపా నాయకులు మానవ హక్కులకు భంగం వాటిల్లేలా తెదేపా కార్యకర్తలపై వరుస దాడులకు పాల్పడుతున్నారంటూ తెదేపా ఎంపీలు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఆర్‌సీ సభ్యులు ముఖేశ్, లాల్ బాహర్, అరుణ్ కుమార్, మల్లయ్య గుంటూరు చేరుకున్నారు. కమిషన్ సభ్యులతో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఎస్పీ విజయరావు భేటీ అయ్యారు. ఈ బృందం ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు గుంటూరు జిల్లాలో పర్యటించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సత్తుపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మహిళా కండక్టర్ మృతికి నిరసనగా ఆర్టీసీ ఐకాస నేతలు ఇవాళ సత్తుపల్లి బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఐకాస నేతలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
5. నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరదనాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను 10 మీటర్లమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. మొత్తం 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ, అంతే మొత్తాన్ని నిల్వ చేస్తున్నారు.
6. సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ బాబ్డే
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం సంతకం చేశారు. నవంబరు 18న ఆయన 47వ సీజేఐగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు జస్టిస్ బాబ్డే సీజేగా కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీకాలం నవంబరు 17తో ముగియనుంది.
7. కార్చిచ్చు.. భయంతో హాలీవుడ్ స్టార్స్ పరుగులు
కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమంగా లాస్ఏంజిల్స్‌ను తాకింది. హాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్‌వుడ్ సహా పలు శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది. దీంతో అనేక విల్లాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి అగ్నికీలలు ఎగిసిపడటంతో సెలబ్రిటీలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్రెంట్‌వుడ్ ప్రాంతంలో మిలియన్ డాలర్లు విలువ చేసే కనీసం ఐదు ఇళ్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
8. కొరడా దెబ్బలు తిన్న సీఎం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ఓ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. గోవర్ధన పూజ పురస్కరించుకొని సీఎం ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట పూజారి చేతిలో కొరడా దెబ్బలు తింటే మంచిదని స్థానికుల నమ్మకం. విషయం తెలుసుకున్న సీఎం తానూ కొరడా దెబ్బలు తిన్నారు. ఆలయ పూజారి సైతం సీఎంను సామాన్య భక్తుడిగానే భావించి కొరడా ఝుళిపించారు. ఆరు కొరడా దెబ్బలు తిన్న తర్వాత సీఎం ఇక చాలు అన్నట్లు చేతిని వెనక్కి తీసుకున్నారు.
9. ప్రకృతి అందాలకు నెలవుగా మారిన అహోబిలం
10. కుర్ర అభిమానిని ఆశ్చర్యపర్చిన వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసులు గెలిచాడు. ఆదివారం శ్రీలంకతో తలపడిన మ్యాచ్‌లో వార్నర్(100*) అద్భుత శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టుపై ఆసీస్ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా మ్యాచ్‌కు ముందు వార్నర్ ఓ కుర్ర అభిమానిని ఆశ్చర్యపర్చాడు. స్టేడియంలో ప్రాక్టీస్ చేసి తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న సమయంలో ఆసీస్ ఓపెనర్.. ఓ బాలుడికి తన గ్లోవ్స్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది.
నేటి పది ప్రధాన వార్తలు – 10/29
Related tags :