బ్రిటన్‌లో 165 ఏళ్ల చరిత్ర కలిగిన డైలీ టెలిగ్రాఫ్, సండే టెల్రిగాఫ్ పత్రికలను అమ్మకానికి పెట్టారు.
ఈ పత్రికలను సర్ ఫెడ్రిక్, సర్ డేవిడ్ బార్క్‌లే సోదరులు 2004లో కొన్నారు.
గత కొన్నేళ్లుగా లాభాలు భారీగా తగ్గడంతో వాటిని అమ్మేయాలని ఆ సోదరులు నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ రెండు పత్రికలు కన్సర్వేటివ్ పార్టీకి అనుకూలమని చెబుతుంటారు.
ఈ పత్రికలను అమ్ముతారంటూ గత ఏడేళ్లుగా వార్తలొస్తున్నాయి.
గతంలో ఈ వార్తలను ఖండించిన బార్క్‌లే సోద రులు ఇప్పుడు మాత్రం నో కామెంట్ అంటున్నారు.