Movies

బన్నీ VS సేతుపతి

Vijay Sethupathi Against Allu Arjun

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తుండటంతో సినిమాపై అభిమానులు ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంటుండగానే బన్నీ… క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీ అల్లు అర్జున్‌కు 20వ చిత్రం కావడంతో చిత్ర యూనిట్‌ AA#20 వర్కింగ్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఆర్య, ఆర్య-2 సినిమాలు రాగా ఇది హ్యట్రిక్‌ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోనున్నట్లు సమాచారం.