DailyDose

కోడిపందెలపై దాడి. ఇద్దరు మృతి-నేరవార్తలు-10/30

Cock Fight Area Raided By Police-Telugu Crime News-10/30

*ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పరిధిలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పరారయ్యే క్రమంలో ముగ్గురు వ్యక్తులు కాల్వలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. మరోవ్యక్తికోసం గాలింపు చేపట్టారు.
* గుంటూరు ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపలువురు ప్రయాణీకులకు స్వల్పగాయాలు.
పోలాల్లోకి దూసుకెళ్లడంతో తప్పినపెను ప్రమాదం.వినుకొండ నుంచి విజయవాడ వెళ్తున్నబస్సువర్షం కురుస్తున్న సమయంలో బస్సునువేగంగా నడపటంతో ఘటన చోటుచేసుకుంది.
* అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి సహా పలువురు తెదేపా నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం గ్రామంలో తెదేపా నేతల ఇళ్లకు అడ్డుగా వైకాపా నేతలు బండలు పాతిన విషయంపై ఆరా తీసేందుకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. జేసీ దివాకర్‌ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు యామినీ బాల, బీటీ నాయుడును అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు
*వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో, దారుణం చోటు చేసుకున్నది. రెండేళ్ల చిన్నారుపై, తాత వరస అయ్యే వృద్ధుడు, యాకుబ్ ఆత్యాచారం. పాపకు తీవ్ర రక్తస్రావం. హాస్పిటల్ కు తరలింపు
*ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.
వారిని చూసి పారిపోయే క్రమంలో కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
* కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.
* అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
* ఆ భర్త చాలా పేదోడు. రోజూ కూలీ చేస్తే తప్ప పొట్ట నిండని పరిస్థితి. అతడి భార్యకు కోడిగుడ్లంటే పిచ్చి. రోజూ తెచ్చిపెట్టమని అడిగేది. కానీ, ఆ స్థోమత లేని ఆ భర్త తెచ్చిపెట్టలేకపోయేవాడు. దీంతో ఆమె గొడవ పడేది. ఓ సారి గుడ్లు తెస్తావా తేవా అని గొడవ పెట్టుకుని ప్రియుడితో పరారైపోయింది.
* మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. భార్యపై అత్యాచారం చేసి భర్తను మట్టుబెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
* జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ధర్మపురి, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం, బుగ్గారం మండలాల్లో భారీ వర్షం కురియడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
*కశ్మీర్‌ అంశంపై భారత్‌కు మద్దతిచ్చే దేశాలన్నీ మాకు శత్రువులే. యుద్ధమొస్తే ఆ దేశాలపైనా క్షిపణి దాడులు చేస్తాం. కశ్మీర్‌ వివాదంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు చూస్తుంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు.
*వరకట్న వేధింపుల కింద నమోదైన ఓ కేసులో గుంటూరు పట్టణ మహిళా ఠాణా పోలీసులు నలుగురు చిన్నారుల పేర్లను చేర్చటంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
*గుంటూరు పట్టణ మహిళా ఠాణాలో నలుగురు చిన్నారులపై వరకట్న కేసు నమోదైంది. పోలీసులు యాంత్రికంగా వ్యవహరించి, నమోదు చేసిన ఈ కేసును కొట్టేయాలని నలుగురు చిన్నారులు తమ పెద్దలతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు.
*సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ మంగళవారం ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీసుస్టేషన్ పరిధిలో మర్రి శ్రీనివాస్రెడ్డి వరుస ఘాతుకాలు బయట పడటానికి దారి తీసిన బాలిక హత్య కేసు విచారణను నల్గొండ న్యాయస్థానం ప్రారంభించింది.
*అటవీ సిబ్బందిపై ఓ రైతు కుటుంబం దాడికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం రెబ్బెన శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
*ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొన్నాళ్లు కాపురమూ చేశాడు.. తీరా ఐపీఎస్కి ఎంపిక కాగానే నమ్ముకున్న అమ్మాయిని దూరంగా ఉంచాడు.. విడాకులిస్తే వేరే పెళ్లి చేసుకుంటానంటూ వేధించసాగాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా తీరు మారలేదు. కుటుంబ సభ్యులూ బెదిరిస్తుండటంతో బాధితురాలు జవహర్నగర్ పోలీసులను ఆశ్రయించింది.
*ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేశ్గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్కతాకు చెందిన బ్యాంకు నుంచి సుఖేశ్.. రూ.కోట్లలో రుణం తీసుకున్నారు.
*ట్రైనీ ఐపీఎస్ అధికారిపై జవహర్ నగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఏడాదిన్నర తర్వాత దూరం పెడుతున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహర్నగర్ పోలీసులు ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
*ఐఐటీ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న పి.సిద్దార్థ అనే విద్యార్థి వసతిగృహం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున 3:26 గంటలకు ఐఐటీ ప్రాంగణంలోని తాను ఉంటున్న వసతిగృహం మూడో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
*ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేశ్గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్కతాకు చెందిన బ్యాంకు నుంచి సుఖేశ్.. రూ.కోట్లలో రుణం తీసుకున్నారు.
*మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సోమవారం రాత్రి దారుణం జరిగింది. ఓ హోటల్‌ సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తన్నుకున్నారు.