DailyDose

గిరిజనులను మోసం చేస్తున్న కేసీఆర్-రాజకీయ-10/30

గిరిజనులను మోసం చేస్తున్న కేసీఆర్-రాజకీయ-10/30-MLAs Shock Talasani-Telugu Political News-10/30

*మున్సిపల్ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ సరూర్నగర్లో ఆర్టీసీ ఐకాస సకలజనుల సమరభేరి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ఉత్తమ్ కోరారు.
*కష్టానికి తగిన గుర్తింపు: మంత్రి కేటీఆర్-హుజూర్నగర్ ఉప ఎన్నికలో నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పనిచేసి చిరస్మరణీయ విజయాన్ని అందించారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. హుజూర్నగర్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ సోమ, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ సందీప్రెడ్డిలు మంగళవారం కేటీఆర్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఉప ఎన్నికలో చక్కటి వ్యూహంతో పనిచేశారని పల్లాను కేటీఆర్ అభినందించారు.
*రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వేసిన జాతీయ జెండా రంగును తొలగించి వైసీపీ పార్టీ రంగు వేస్తున్నారు.గ్రామ సచివాలయానికి జాతీయ జెండా రంగు ఉండకూడదా అంటూ వైసీపీ నాయకుల తీరును స్థానికులు ప్రశ్నిస్తున్నారు.స్థానికులు తీవ్ర అభ్యంతరం చెపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.వైసీపీ నాయకుల తీరు నిరసనగా జాతీయ జెండా రంగును తొలగించి వైసీపీ పార్టీ రంగు వేస్తున్నా వారిపై కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.వైస్సార్ పార్టీకి పోలిసులు అండగా నిలుస్తున్నారని పిటిషన్లో పేర్కొంటున్నారు.
*చంద్రబాబు హయాంలో అంతా పసుపుమయం .. అప్పడాల మీద కూడా బాబే
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. ఏపీ సీఎంగా పాలనా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన దూకుడు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం అధికారపార్టీకి తలనొప్పిగా మారాయి. విమర్శలకు కారణం అవుతున్నాయి.గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అలాంటి తప్పిదాలే వైసిపి ప్రభుత్వం కూడా చేస్తుందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, అనవసరపు దుబారా ఖర్చులు పెట్టారని, ప్రచార ఆర్భాటాల కోసం విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏపీలో చర్చ జరిగింది.
* ఏపీలో ఇసుక కొరతపై విపక్ష పార్టీలు ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు అండగా టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ నిరసన దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్నారు. ఈ సాయంత్రం ఐదు గంటల వరకు లోకేష్ దీక్ష చేయనున్నారు. వైసీపీ నేతలు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడంవల్లే ఇసుక దొరకడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో అల్లాడుతున్నారని.. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడా ఆకలి బాధలు లేవని చెబుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.r
*తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా పార్టీ బాధ్యులుఇసుకపై సీఎం జగన్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన చంద్రబాబు
ఇసుక వారోత్సవాల నిర్వహణ సిగ్గుచేటు: చంద్రబాబురాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు కాదు, ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు జరపాలి గతంలో నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు ఉన్నారు. ఇప్పుడు ఊరికో వైసిపి ఇసుకాసురులు తయారయ్యారు.నరకాసురుడి అంతంతోనే దీపావళి. ఇసుకాసురుల భరతం పడితేనే పేదలకు దీపావళి.రోజు కూలీలకు అండగా ఉండేవాళ్లను, రాబందుల్లా రాళ్లేస్తున్నారని అంటారా..? రాబందులు మేముకాదు, రాక్షసుల్లా మీరే చేస్తున్నారు. నిన్న పిడుగురాళ్లలో ట్రక్కు డ్రైవర్ గోపి ఆత్మహత్య చేసుకున్నాడు.
*ఎస్సీ వర్గీకరణపై డిసెంబరులో చలో దిల్లీ
రాష్ట్రంలో దళితులందరికీ మూడెకరాల సాగు భూమి ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. సాగు చేస్తున్న అర్హులకే భూమి ఇస్తామని చెప్పిందన్నారు. సాగుభూమి కొరత కారణంగా వెంటనే అందరికీ ఇవ్వలేదని, భూమి చూపిస్తే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ‘ఎస్సీ వర్గీకరణ – మాదిగల సమగ్ర అభివృద్ధి’ అనే అంశంపై మాదిగ సంఘాలు, ప్రజాప్రతినిధులు మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా డిసెంబరు 9, 10, 11 తేదీల్లో చలో దిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ప్రకటించారు. సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వి.ఎం.అబ్రహం (ఆలంపూర్), కె.యాదయ్య (చేవెళ్ల), మాదిగ జేఏసీ అధ్యక్షులు బి.వీరేందర్, టీఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇటుక రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు.
*గిరిజనులను మోసం చేస్తున్న కేసీఆర్
రాష్ట్రంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని విస్మరించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని మోసం చేస్తున్నారని వివిధ రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. గిరిజనుల రిజర్వేషన్ల సాధనకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. తెలంగాణ గిరిజన లంబాడీ ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో చర్చావేదిక నిర్వహించారు. ఇందులో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ను గద్దె దించడం ద్వారానే గిరిజనులు తమ రిజర్వేషన్లను సాధించుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 48 గంటల్లో గిరిజన రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవడంతోపాటు తొలి సంతకం దానిపైనే ఉంటుందని హామీ ఇచ్చారు. మాట ఇచ్చి తప్పడంలో కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని మాజీ ఎంపీ, భాజపా నేత జి.వివేక్ విమర్శించారు.
*ఇసుక కొరతపై నేడు తెదేపా నిరాహారదీక్ష
ఇసుక కొరత, అక్రమ రవాణా, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట బుధవారం సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ పాల్గొంటారు.
*త్వరలో వైకాపాలోకి వల్లభనేని వంశీ?
ఎమ్మెల్యే పదవికి, తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ త్వరలో వైకాపాలో చేరనున్నట్టు సమాచారం. వంశీ వైకాపాలో చేరడం ఖాయమని, తేదీ ఖరారు కావలసి ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైకాపా టిక్కెట్పై వంశీ మళ్లీ గన్నవరం నుంచి పోటీ చేస్తారని, ప్రస్తుతం వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవినిచ్చే అవకాశముందని అంటున్నాయి. వంశీ వర్గానికి చెందిన నాయకులు.. మంగళవారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి స్థానిక నాయకత్వం నుంచి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. మరోవైపు వంశీతో మాట్లాడేందుకు తెదేపా నాయకులు చేసిన ప్రయత్నాలు మంగళవారం ఫలించలేదు.
*మన ఎంపీలను అనుమతించరేం: ప్రియాంక
ఈయూ ఎంపీలను కశ్మీర్లో పర్యటనకు అనుమతించి, మన ఎంపీలకు మాత్రం ఎందుకు అడ్డు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. దేశానికే ఇది ఇబ్బందికర పరిణామమని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. తమలాంటి వారిని అడ్డుకుని, ఈయూ బృందాన్ని అనుమతించడం భారత పార్లమెంటుకు అవమానకరమని గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.