* స్టాక్‌మార్కెట్లు ఇవాళ పరుగులు తీస్తున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 40 వేల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది జూలై తర్వాత సెన్సెక్స్ ఈ దూకుడు ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఇవాళ ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 250 పాయింట్లు పుంజుకున్నది. విదేశీ నిధుల రాబడి, ఇన్వెస్టర్లకు పన్ను రాయితీల నేపథ్యంలో మార్కెట్లు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. నిఫ్టీ కూడా 35.85 పాయింట్లు అడ్వాన్స్ సాధించింది.. ట్రేడింగ్‌లో 11 వేల 822 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. సెన్సెక్స్ ట్రేడింగ్‌లో భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, వేదాంత, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీలు రెండు శాతం వృద్ధి సాధించాయి. ఆర్బీఐ జరిమానా వేసిన బందన్ బ్యాంకు షేర్లు ట్రేడింగ్‌లో పడిపోయాయి.
* క్యాబ్ అగ్రిగేటింగ్ స్టార్టప్ ఓలా రూ.1,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రముఖ ఐటీ సేవల కంపెనీ మైక్రోసాఫ్ట్‌తో చర్చలు మొదలుపెట్టింది. సంప్రదింపులు ముగింపుకు చేరుకున్నాయని, 10–15 రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
*దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 254 పాయింట్లు లాభపడి 40086 వద్ద ప్రారంభమైంది.
నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 11884 వద్ద ప్రారంభమైంది
*భారతీ ఎయిర్టెల్ జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల వెల్లడిని నవంబరు 14వ తేదీకి వాయిదా వేసింది. వాస్తవానికి కంపెనీ మంగళవారమే ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
*డీహెచ్ఎఫ్ఎల్ ఆర్థిక అవకతకవల వ్యవహారాన్ని తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్ఎఫ్ఐఓ)కు ప్రభుత్వం అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
*హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్‌గా అశోక్ వాజ్‌పేయి నియమితులయ్యారు. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ (ఐహెచ్‌హెచ్) అనుబంధ సంస్థ అయిన గ్లెనేగ్లెస్ డెవలప్మెంట్ పీటీఈ లిమిటెడ్ ఈ నియామకాన్ని ప్రకటించింది.
*ఆన్లైన్ ప్రయాణ ఏజెంట్లు మేక్మైట్రిప్-గో ఐబిబోలతో పాటు, ఆతిథ్య సేవల సంస్థ ఓయోపై దర్యాప్తు చేపట్టాలని కాంపిటిషన్ కమిషన్(సీసీఐ) ఆదేశించింది.
*హైదరాబాద్‌కు చెందిన అవెరెక్సీ ఎంటర్ప్రైజెస్, ఐర్లాండ్‌కు చెందిన సెలోమ్ ఏవియేషన్‌లు భాగస్వామ్య ఒప్పందం కుదర్చుకున్నాయి. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అవెరెక్సీ సంస్థ వ్యవస్థాపకులు, డైరెక్టర్ మనీశ్ సింగ్, సెలోమ్ ఏవియేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రవిరెడ్డి పాల్గొని ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
*ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫ్యాప్సీ) 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది.
*టాటా గ్రూపులోని అధిక భాగం కంపెనీలకు ప్రమోటర్‌గా కొనసాగుతున్న టాటా సన్స్ రూ.6,500 కోట్ల నిధులను టాటా మోటార్స్‌లోకి చొప్పించబోతోంది.
*అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) తన ఔషధాల విక్రయాల వ్యాపారంలో కొంత భాగాన్ని విడదీసి తన అనుబంధ సంస్థకే రూ.527.8 కోట్లకు అప్పగించబోతోంది.
నిధుల వేటలో ఓలా-వాణిజ్యం-10/30
Related tags :