Food

క్యారెట్లను కుమ్మేయండి

Types of carrot recipes-Telugu food news-Easy fast and short recipes in Telugu-క్యారెట్లను కుమ్మేయండి

క్యారెట్‌ను నేరుగా తినడం, లేదంటే ఎప్పుడో ఒకసారి కూరల్లో వేయడం చేస్తుంటారు. అయితే ‘రెయిన్‌బో’ (వివిధ రంగుల్లో) ఆహారంలో క్యారెట్‌ మంచి ఆరోగ్యకరమైనది. దీనిలోని బీటా కెరోటిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది. వెయిట్‌లాస్‌కు కూడా ఉపయోగపడే క్యారెట్‌ను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. కేవలం సలాడ్స్‌ రూపంలో వీటిని తీసుకోవడం బోర్‌కొడితే, రెగ్యులర్‌ డైట్‌లో వివిధ రూపాల్లో తీసుకోవచ్చంటున్నారు న్యూటిషనిస్టులు. క్యారెట్‌ను ఇలా కూడా వాడొచ్చు…

సూప్స్‌: క్లియర్‌ సూప్స్‌లోకి క్యారెట్‌ను ఎంచక్కా తరిగి వేయొచ్చు. జీర్ణక్రియకు క్యారెట్‌ బాగా ఉపకరిస్తుంది. క్యారెట్‌ జ్యూస్‌ తాగడానికి ఇబ్బందిపడితే, దానికన్నా సూప్స్‌ రూపంలో తీసుకోవడం మంచిది. వేడివేడిగా ఈ సూప్స్‌ను ఇష్టంగా లాగించేయొచ్చు.

ఫ్రైడ్‌ రైస్‌: రోజూ తీసుకునే ఆహారంలో ఫైబర్‌ తప్పకుండా ఉండాలి. ఫైబర్‌ పరిమాణం పెరగాలంటే చైనీస్‌ ఫ్రైడ్‌ రైస్‌ తరహాకు వెళ్లాల్సిందే. ఫ్రైడ్‌రైస్‌లో కార్న్‌, బీన్స్‌ తీసుకున్నట్టే క్యారెట్‌ను కూడా కలపాలి. క్యారెట్‌లో నీటిశాతం అధికంగా ఉంటుంది కాబట్టి పొట్ట తొందరగా నిండినట్టవుతుంది.

డిప్స్‌: వెజిటబుల్‌ డిప్స్‌, కర్డ్‌ డిప్స్‌లాగే క్యారెట్‌తో రుచికరమైన డిప్స్‌ తయారుచేయొచ్చు. క్యారెట్‌ రైతా, క్యారెట్‌ హమ్మస్‌ బాగుంటాయి. క్యారెట్‌ను రోస్ట్‌ చేసి మెత్తగా అయిన తర్వాత, ఇతర దినుసులు, క్రీమ్‌ కలిపి రైతా, హమ్మస్‌లు తయారుచేయొచ్చు. వీటిలో బ్రెడ్‌ లేదా ఇతర డిప్స్‌ అద్దుకుని తింటే బాగుంటాయి.

పచ్చళ్లు: క్యారెట్‌ను పచ్చళ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. మిగతా కూరగాయలతో పచ్చళ్లు చేసినట్టే, క్యారెట్‌తో కూడా చేసుకోవచ్చు. సలాడ్స్‌కు క్యారెట్‌ పచ్చళ్లను జతచేస్తే రుచి రెట్టింపు అవుతుంది. రోటీతో కూడా దీన్ని తీసుకోవచ్చు.

పచ్చళ్లు: క్యారెట్‌ను పచ్చళ్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. మిగతా కూరగాయలతో పచ్చళ్లు చేసినట్టే, క్యారెట్‌తో కూడా చేసుకోవచ్చు. సలాడ్స్‌కు క్యారెట్‌ పచ్చళ్లను జతచేస్తే రుచి రెట్టింపు అవుతుంది. రోటీతో కూడా దీన్ని తీసుకోవచ్చు.

బేక్‌ చేసి: మఫిన్స్‌, కేక్స్‌, బ్రెడ్‌ వంటి బేక్డ్‌ పదార్థాలలో క్యారెట్‌ను వాడొచ్చు. భోజనం తర్వాత తీసుకునే డిసెర్ట్‌లలో కూడా క్యారెట్‌ను తురిమి మిక్స్‌ చేయొచ్చు. క్యారెట్‌ కేక్స్‌ కూడా పాపులర్‌ అవుతున్నాయి. క్యారెట్‌కు సహజంగానే తీయని రుచి ఉంటుంది కాబట్టి బేక్డ్‌ బిస్కట్లలో కలిపితే అవి మరింత రుచికరంగా ఉంటాయి.