Movies

డోసు తగ్గించిన బసు

Bipasha Basu To Star In Bold Indian Web Series

బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగన్, సైఫ్‌ అలీఖాన్, కియారా అద్వానీ, రాధికా ఆప్టే.. తదితర తారలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కూ ఓకే చెబుతున్నారు. తాజాగా బిపాసా బసు కూడా ఈ వైపు అడుగులు వేయబోతున్నారని బీటౌన్‌ టాక్‌. పాపులర్‌ అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘అన్‌రియల్‌’ ఆధారంగా ఓ టెలివిజన్‌ సిరీస్‌ బాలీవుడ్‌లో మొదలు కానుందట. ఇందులో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట బిపాసా. టీఆర్‌పీల కోసం అడల్ట్‌ కంటెంట్‌ను క్రియేట్‌ చేసే ఓ రియాలిటీ షో ప్రొడ్యూసర్‌గా బిపాసా నటిస్తారట. ‘అన్‌రియల్‌’లోని కంటెంట్‌ కాస్త బోల్డ్‌గా ఉంటుందట. అయితే డోస్‌ వద్దు బసు అని సన్నిహితులు చెప్పడంతో పాటు, తాను కూడా సుముఖంగా లేకపోవడంతో నిర్వాహకులతో మాట్లాడి ఇండియన్‌ సిరీస్‌కి మాత్రం డోస్‌ తగ్గించాలనుకుంటున్నారట బిపాసా.