DailyDose

కాగ్నిజెంట్ నుండి 7వేల మంది ఔట్-వాణిజ్యం-10/31

CTS To Fire 7000 Employees-Telugu Business News-10/31

*అమెరికాకు చెందిన సాఫ్ట్‌ వేర్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ సంస్థ వచ్చే మరికొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి తప్పుకోనుండటంతో ఈ నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత జరిగే పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం మరో 6,000 మంది ఉద్యోగులపై కూడా ఉండే అవకాశం ఉంది.
పోస్టు ఎర్నింగ్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా కాగ్నిజెంట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 10,000-12,000 మంది మధ్యశ్రేణి నుంచి సీనియర్‌ ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని పేర్కొంది. మరో 5,000 మందికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఇతర విధుల్లో చేరుస్తామని పేర్కొంది. ‘‘కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ మార్పులు మరో 6,000 మంది బాధ్యతలపై ప్రభావం చూపిస్తాయి. వారి బాధ్యతలు మారే అవకాశం ఉంది’’ అని కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ ఒకరు తెలిపారు.
ప్రస్తుతం కాగ్నిజెంట్‌ కంటెట్‌ మోడరేషన్‌ వ్యాపారంలో ఫేస్‌బుక్‌ వంటి పెద్ద ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. ఈ విభాగం నుంచి వైదొలగితే కంపెనీ కమ్యూనికేషన్‌, మీడియా, టెక్నాలజీ విభాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
*అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ సంస్థ వచ్చే మరికొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి తప్పుకోనుండటంతో ఈ నిర్ణయం తీసుకోనుంది.
* వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,410, విజయవాడలో రూ.38,450, విశాఖపట్నంలో రూ.39,660, ప్రొద్దుటూరులో రూ.38,470, చెన్నైలో రూ.38,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,540, విజయవాడలో రూ.35,650, విశాఖపట్నంలో రూ.36,480, ప్రొద్దుటూరులో రూ.35,630, చెన్నైలో రూ.36,670గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,100, విజయవాడలో రూ.47,300, విశాఖపట్నంలో రూ.47,600, ప్రొద్దుటూరులో రూ.47,300, చెన్నైలో రూ.49,900 వద్ద ముగిసింది.
* జీవితకాల గరిష్ఠానికి సెన్సెక్స్‌దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్ఠానికి చేరింది. ఉదయం 40,188 వద్ద ప్రారంభమైన సూచీ ఓ దశలో 293 పాయింట్లు ఎగబాకి 40,344.99 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా దాదాపు అదే స్థాయిలో జోరు కనబరుస్తోంది. ఓ దశలో 64 పాయింట్లు లాభపడి 11,908 మార్క్‌కు చేరింది.
*స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ నేటి ఆరంభ ట్రేడింగ్లో జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. 40, 329ని తాకి.. ఈ ఏడాది జూన్లో నమోదయిన 40, 312ను అధిగమించి నూతన రికార్డును నెలకొల్పింది. నిఫ్టీ 11, 900కు చేరి 12వేలకు చేరువలో ఉంది.
*స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. బుధవారం ఈ కంపెనీ షేరు 0.79 శాతం లాభంతో రూ.1,478.70 వద్ద ముగిసింది.
*సంపన్నులు, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో తగ్గింపునకు అవకాశం ఉండకపోవచ్చని ప్రభుత్వవర్గాల ద్వారా తెలుస్తోంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ రూ.822.77 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం రూ.767.37 కోట్లతో పోలిస్తే 7 శాతానికి పైగా పెరిగింది.
*సిమెంట్ తయారీ రంగంలోని రామ్కో సిమెంట్ స్టాండ్ అలోన్ లాభం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో 68 శాతం పెరిగి రూ.168.15 కోట్లకు చేరింది.
*ప్రభుత్వ రంగంలోని యునైటెడ్ బ్యాంక్ రెండో త్రైమాసికంలో లాభాల్లో ప్రవేశించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.883.17 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించగా ఈ త్రైమాసికంలో రూ.123.88 కోట్ల లాభం నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.3013.74 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే మొండి బకాయిలు 14.36 శాతం నుంచి 7.88 శాతానికి తగ్గాయని బ్యాంకు తెలిపింది.
*అమెరికా కేంద్ర బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ మరోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. కీలకమైన వడ్డీ రేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.