1.నాగుల చవితి…ప్రకృతిలో ఓ భాగం-ఆద్యాత్మిక వార్తలు -10/31
కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. నాగుల చవితి, దీపావళి వెళ్లిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలీ చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కాకరపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశంలో చలిమిడి నాగేంద్రుడుని పెట్టుకుని, పూజ చేసుకుంటారు. పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశాలు తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు. యోగసాధన ద్వారా కుండలనీ శక్తి ని ఆరాధించడమే నాగులచవితి. కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారంగానీ, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసం ఉండి నాగపూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉంటుందని నమ్ముతారు. తైత్తిరీయ సంహిత నాగపూజా విధానాన్ని వివరించింది. వేపచెట్టు, రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళాకి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8 వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుట్టలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము (కుండలనీశక్తి) కామోద్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అనేది ఈ నాగులచవితిలోని అంతరార్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి రుషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
2. తితిదేలో భారీగా తొలగింపులు
తిరుమల, తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందికి ఉద్వాసన పలకాలని తితిదే నిర్ణయించింది. ఈ ప్రభావం సుమారు వంద మందిపై పడనుంది. జాబితా బుధవారం రాత్రికే సిద్ధం కాగా గురువారం ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు, సిబ్బందిని తక్షణమే తొలగించాలన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. 2019 మార్చి 31కి ముందు నియమితులైన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులందరికీ ఈ నియమం వర్తించనుంది. శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఆయన విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
3.యాదాద్రిలో అన్నప్రసాద భవనానికి శ్రీకారం
యాదాద్రి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాదం నిర్వహణ కోసం ప్రత్యేక భవన సముదాయం నిర్మాణానికి బుధవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భూమి పూజ చేశారు. కొండ కింద గంధమల్ల చెరువు సమీపంలో యాడా కేటాయించిన నాలుగు ఎకరాల్లో రూ.12 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి విరాళమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీ వేగేశ్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆనంద్రాజు ముందుకొచ్చారని యాడా వైస్ఛైర్మన్ కిషన్రావు తెలిపారు.
4. పంచాంగం 31.10.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: శుక్ల
తిథి: చవితి రా.తె.04:15 వరకుతదుపరి పంచమి వారం: గురువారం నక్షత్రం: జ్యేష్ఠ రా.01:29 వరకుతదుపరి మూల
యోగం: శోభన, అతిగండ కరణం: వణిజ
వర్జ్యం: ఉ.07:10 – 08:45
దుర్ముహూర్తం: 10:04 – 10:50 మరియు 02:40 – 03:26
రాహు కాలం: 01:25 – 02:52
గుళిక కాలం: 09:06 – 10:33
యమ గండం: 06:13 – 07:40 అభిజిత్ : 11:36 – 12:22
సూర్యోదయం: 06:13
సూర్యాస్తమయం: 05:45
వైదిక సూర్యోదయం: 06:17
వైదిక సూర్యాస్తమయం: 05:41
చంద్రోదయం: ఉ.09:12
చంద్రాస్తమయం: రా.08:40
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: దక్షిణం
నక్షత్ర శూల: తూర్పు
చంద్ర నివాసం: ఉత్తరం
నాగుల చవితి
5. రాశిఫలం -31/10/2019
తిథి:
శుద్ధ తదియ రా.తె.4.27, కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
అనూరాధ రా.1.03
వర్జ్యం:
శేషవర్జ్యం: ఉ.7.06 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు తీవిశేషాలు: త్రిలోచన గౌరీవ్రతం
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్ర్తిలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఋణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండవు. మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడుట మంచిది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి వుంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
6. శ్రీరస్తు శుభమస్తు
*తేది : 31, అక్టోబర్ 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 2 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 1 ని॥ వరకు చవితి తిధి తదుపరి పంచమి తిధి)
నక్షత్రం : జ్యేష్ట(నిన్న రాత్రి 9 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 31 ని॥ వరకు జ్యేష్ఠ నక్షత్రం తదుపరి మూల నక్షత్రం )
యోగము : (శోభనం ఈరోజు ఉదయం 9 గం ll 42 ని ll వరకు తదుపరి అతిగండ రేపు ఉదయం 7 గం ll 57 ని ll వరకు)
కరణం : (వణిక్ ఈరోజు మధ్యాహ్నం 1 గం ll 31 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 59 ని ll )
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 27 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 37 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 42 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 14 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యరాశి : తుల ⚖
చంద్రరాశి : వృచ్చికము
నాగులచవితి
7. నేటి ఆణిముత్యం *
మారవలయును చేతలు, మాటలన్నికలియుగంబున వానిచే కలుగు మేలు,ఎట్టి విధమున మారలేనట్టి వారిజన్మ వృధ యంచు దలపరే జనులు ఎల్ల?
*భావము:*
మాటలు, చేతలు ఎప్పటికప్పుడు మార్చుకోవటం వల్ల ఈ కలియుగంలో మేలు కల్గుతుంది. ఏ విధంగాను మారలేని వ్యక్తుల జన్మ వ్యర్ధమని ప్రజలు తలుస్తారు.
* నేటి సుభాషితం *
8. నేటి జాతీయం *
*కొట్టొచ్చి నట్టుంది*
చాల స్పస్టంగా వున్నదని అర్థం: ఉదా: …. వాని మొఖంలో ద్వేషబావం కొట్టొచ్చినట్టు కనబడుతున్నది చూడు.
*కొత్త కుండలో ఈగ లాగ*
ఏ పనీ దొరక్కుండా ఖాళీగా ఉండటం, ఏమీ తోచకుండా ఉండటం
9. మన ఇతిహాసాలు *
*శంతనుడు*
*నిన్నటి తరువాయి*
*శంతనుడు తన కుమారుడితో తిరిగి కలుసుకొనుట*
భార్య, కొడుకును కోల్పోయిన దు:ఖంతో నిండిన శంతనుడు బ్రహ్మచార్యను ఆచరించడం మొదలుపెట్టాడు. తన రాజ్యాన్ని బాగా పరిపాలించాడు. కేవలం సద్గుణ ప్రవర్తనను అవలంబించడం ద్వారా శాంతనుడు ఆయుధాలను ఉపయోగించకుండానే ప్రపంచం మొత్తాన్ని సులభంగా జయించగలిగాడు. రాజులందరూ శాంతనుడిని చక్రవర్తిగా ప్రకటించారు. అతని పాలన శాంతియుతంగా కొనసాగింది. శాంతను వేటను వదలి తన పాలన నుండి ప్రజాదరణ పొందాడు.
ఒక రోజు గంగా ఒడ్డున నడుస్తున్నప్పుడు నది జలరహితంగా మారడం శంతనుడు గమనించాడు. ఈ దృగ్విషయం కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన తన ఆయుధంతో నది ప్రవాహాన్ని కట్టడి చేసిన ఒక అందమైన యువకుడిని చూశాడు. ఆయువకుడు ఆయన కుమారుడు అయినప్పటికీ శంతనుడు అతడిని గుర్తించలేదు. ఎందుకంటే అతను జన్మించిన కొద్ది క్షణాలు తరువాత గంగాదేవి తన కుమారుడితో శతనుడిని విడిచి పోయింది. బాలుడు మాత్రం ఆయన తన తండ్రి అని గుర్తించాడు. అయినప్పటికీ అతను దానిని శంతనుడికి వెల్లడించలేదు. బదులుగా అతను తన భ్రమ శక్తిని ఉపయోగించి తన దృష్టి నుండి అదృశ్యమయ్యాడు. ఇది చూసిన శంతనుడు బాలుడు వాస్తవానికి తన కొడుకు కాదా అని ఆశ్చర్యపోతూ బాలుడిని తనకు చూపించమని గంగాను పిలిచాడు. గంగా ఇలా స్త్రీరూపంలో కనిపించిన తరువాత బాలుడు వాస్తవానికి తన కుమారుడు దేవవ్రతుడు అని, వశిష్టఋషి నుండి పవిత్ర గ్రంథాల పరిజ్ఞానాన్ని, పశురాముని వద్ద యుద్ధ కళను నేర్చుకున్నాడని గంగాదేవి ఆయనకు వెల్లడించించి కుమారుడిని శంతనుడికి అప్పగించింది. దేవవ్రతుని గురించి నిజం వెల్లడించిన తరువాత ఆమె శంతనుడితో కుమారుడిని తీసుకుని హస్తినాపురానికి తీసుకెళ్లమని చెప్పింది. రాజధాని చేరుకున్న తరువాత శంతనుడు దేవవ్రతుడిని సింహాసనం వారసుడిగా ప్రకటించి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు.[ఉల్లేఖన అవసరం] గంగాదేవి వంటి భార్యతో వియోగం చెందిన తరువాత కూడా శంతనుడు దేవవ్రతుడి వంటి కుమారుడిని పొందినందుకు ఆనందించాడు. దేవవ్రతుడి సాయంతో శంతనుడు యమునాతీరంలో ఏడు అశ్వమేధ యాగాలు నిర్వహించాడు.
*శంతనుడు మరియు సత్యవతి*
నాలుగు సంవత్సరాల తరువాత శంతనుడు యమునా ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు తెలియని దిశ నుండి వస్తున్న అద్భుతమైన సువాసన వచ్చింది. సువాసన కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన సత్యవతిని (యోజనగంధి) చూశాడు. ఆమె నుండి దివ్యమైన సువాసన వాసన వస్తోంది. సత్యవతి తన గ్రామంలోని మత్స్యకారుల రాజు దత్తపుత్రిక. ఆమెను చూడగానే శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. సత్యవతి తన తండ్రి అనుమతిస్తేనే వివాహం జరిగుతుందని చెప్పింది. శతనుడు మత్స్యరాజు వద్ద సత్యవతిని ఇమ్మని కోరిన తరువాత, సత్యవతి కుమారుడు హస్తినాపుర సింహాసనానినికి వారసత్వంగా పొందాలనే షరతుతో ఆమె తండ్రి వివాహానికి అంగీకరించాడు.
తన పెద్ద కుమారుడు దేవవ్రత సింహాసనం వారసుడు కావడంతో శంతనుడు రాజుపదవి గురించి తన మాట ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నాడు మరియు తన తండ్రి కోసం సత్యవతి పిల్లలకు అనుకూలంగా సింహాసనం మీద తన హక్కును త్యజిస్తానని మత్స్యరాజుకు మాట ఇచ్చాడు. సందేహాస్పద అధిపతికి భరోసా ఇవ్వడానికి సత్యవతి జన్మించిన భవిష్యత్తు తరాలను కూడా తన సంతానం సవాలు చేయకుండా చూసుకోవటానికి జీవితకాల బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న వెంటనే మత్స్యరాజు సత్యవతి, శాంతనుల వివాహానికి అంగీకరించాడు. దేవవ్రతుడు అని దేవతలు ఆయన చేసిన ప్రమాణం కారణంగా ఆయనకు భీష్ముడు (భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు) పేరు పెట్టారు. సత్యవతితో హస్తినాపురానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన తన తండ్రికి చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఈ విషయం గురించి విన్న శంతనుడు భీష్ముని ప్రశశించి కుమారుడు చేసిన త్యాగానికి ప్రతిగా భీష్ముడికి ఇచ్చామరణం (కోరుకున్న సమయంలో మరణించడం) ఒక వరంగా ఇచ్చాడు. శంతనుడికి, సత్యవతికి చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శాంతనుడు మరణించిన తరువాత విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు అయ్యాడు. ఎందుకంటే శంతనుడు జీవించి ఉన్నప్పుడే చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వుడి చేత చంపబడ్డాడు
10. రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 2323 తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు రిటైర్ అయి ఇంకా విధుల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని తాజా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్రమత్తమయ్యారు. అలాంటి ఉద్యోగులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ రోజు రాత్రి లోపు 60 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ రిటైర్డ్ సూపరిడెంట్ డాలర్ శేషాద్రిపై కూడా పూర్తి స్థాయిలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీటీడీ ఇటీవల 12 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి చేసిన నియామకం కూడా ఈ జీవోతో ఆగిపోనుంది.
రిటైర్ అయి 10 ఏళ్లు అయినా..డాలర్ శేషాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం సూపరిడెంట్‌గా పదవీ విరమణ చేసి పదేళ్లు అయినా స్వామివారి సేవలోనే ఆయన కొనసాగుతున్నారు. మధ్యలో కొద్ది కాలం విరామం తీసుకున్నా మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీటీడీ అంటే డాలర్ శేషాద్రి ఒక్కరే అనేలా ఆయన పేరు సంపాదించుకున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోతో డాలర్ శేషాద్రిపై కూడా వేటు పడనుంది.
11. చరిత్ర ఈ రోజు/అక్టోబర్ 31*-జాతీయ ఐక్యతా దినోత్సవం
1875 : భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచినసర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జననం (మ.1950).
1895 : భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సి.కె.నాయుడు జననం (మ.1967).
1925 : తెలుగు సినిమా దర్శకుడు కోటయ్య ప్రత్యగాత్మ జననం (మ.2001).
1937 : ప్రముఖ రచయిత నరిశెట్టి ఇన్నయ్య జననం.
1975 : భారతీయ సంగీత కారుడు. ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ మరణం (జ.1906).
1984 : భారత ప్రధాని ఇందిరా గాంధీ మరణం (జ.1917).
1990 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి మరణం (జ.1928).
2004 : ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు మరణం (జ.1935).
2008 : అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను భారత ప్రభుత్వము చేర్చింది.
2005 : మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని పి.లీల మరణం (జ.1934).
12. తిరు సమాచారం*ఓం నమో వేంకటేశాయ*
ఈజు గురువారం *31-10-2019* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం… శ్రీవారి దర్శనానికి *15* కంపార్ట్ మెంటులో వేచి ఉన్న భక్తులు……. శ్రీవారి సర్వ దర్శనానికి *16* గంటల సమయం పడుతోంది….. ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది….
కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు *4* గంటల సమయం పడుతోంది…..
నిన్న అక్టోబర్ *30* న *72,554* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 2.85* కోట్లు…
13. మంచి స్నేహితుడెవరు?
చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ “రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశిలించి చెప్పండి.” అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.
ఆ మూడుబొమ్మల్లో ఎల్లాంటివ్యత్యాసాన్ని అతడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడుదూరచినసూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేడలేకపోయడు ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి “మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు” అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.
ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడుతనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.
నాగుల చవితి…ప్రకృతిలో ఓ భాగం
Related tags :