Movies

రాశి ఇంటిపై ఐటీ ఎటాక్

Actress Rashi And Her Brother Raided By Income Tax

నటి రాశీ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయా? అంటే అవుననే సమాచారం. రాశీ ఇంటిపైనా ఆమె సోదరుడు కలర్స్ సంస్థ అధినేత అయిన విజయ కృష్ణ ఇల్లు, కార్యాలయం పైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. హైదరబాద్ కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రీ.లి.కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈకంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం నలబై లోకేషన్లలో ఈ సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. ఇటు తెలంగాణా అటు ఆంధ్రా సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఉన్న కలర్స్ ఆఫీసుల్లో సోదాలు చేయడం సంచాలమైంది. ఆర్ధిక వ్యవహారాలు పన్ను చెల్లింపుల్లో తేడా వచ్చిందన్నది ఐటీ అధికారు వివరణ, కలర్స్ కంపెనీకి సంబందించిన డాక్యుమెంట్లు రకరకాల బిల్లులు ఐటీ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారని తెలిసింది. బ్యూటీ ఫిట్ నెస్ వెయిట్ లాస్ తదితర రంగాల్లో కలర్స్ సంస్థ సేవలదిస్తోంది. నటి రాశీ సోదరుడు విజయకృష్ణ దేవుల ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. విజయకృష్ణ ఆయనతో పాటు భాగస్వామిగా ఉన్న రాయుడిపైనా అలాగే రాశీ ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. అయితే ఆదాయం విషయంలో తప్పుడు లెక్కలు చెప్పడంతోనే ఈసోదాలు నిర్వహించామని ఓ ఐటీ అధికారి వెల్లడించారు.