నేటి కాలుష్య జీవనంలో కంటికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కళ్ల విషయంలో జాగ్రత్తగా లేకుంటే అవి పొడిబారి దురద, మంటతో పాటు కళ్ల కింద నల్లటి చారలు ఏర్పడతాయి. వివిధ రకాల అలర్జీల నుంచి కళ్లను కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ నియమాలను పాటించాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేంటో కూడా ఆయన వివరించారు.
* ఆకుకూరల్లో సహజంగా ఉండే విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్, లూటీన్, జీక్సాథిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ కళ్లకు సహజ సిద్ధమైన సన్స్క్రీన్గా పనిచేస్తాయి. సూర్యకాంతిలో ఉండే యు.వి. కిరణాల నుంచి కళ్లను రక్షించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
* శాకాహారులైతే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలను తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి అందుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.
* కార్నియాను కాపాడుకోవాలంటే డైరీ ఉత్పత్తు కూడా శరీరానికి అవసరమే.. వీటిలో విటమిన్ ఎ, జింక్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రాత్రిళ్లు కంటి చూపు మందగించడం జరగదు. కంటి చుట్టూ జరిగే 500కు పైగా బయో కెమికల్ రియాక్షన్ల నుంచి జింక్ రక్షిస్తుంది.
* కంటి సంరక్షణకు గుడ్డును మించిన ఆహారం లేదు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, లుటీన్, జింక్ జీక్సాథిన్లు ఆకుకూరల్లో కన్నా ఎక్కువగా ఉంటాయి. కావున గుడ్లను తినడం వల్ల కళ్లను సంరక్షించుకోవచ్చు.
* కంటి భాగంలో రక్తనాళాలు యాక్టివ్గా పనిచేయడానికి విటమిన్ సి, బయోఫ్లేవనాయిడ్స్ చాలా అవసరం. నారింజ వంటి నిమ్మజాతి పండ్లలో ‘సి’ విటమిన్ బాగా లభిస్తుంది. కాబట్టి నారింజ పండ్లను అధికంగా తినడం వల్ల కళ్లు పొడిబారకుండా ఉంటాయి. అంతేకాదు క్యాటరాక్ట్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
* ట్యూనా, మకెరెల్, సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. కళ్లు త్వరగా పొడిబారే లక్షణమున్నవారు ఈ చేపలు తినడం వల్ల ఆ బాధ నుండి ఉపశమనం పొందవచ్చు. పైగా ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మీ కంటి ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
Related tags :