DailyDose

కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత-తాజావార్తలు-11/01

Telugu Breaking News Of The Day-Intense Situation In Karimnagar-11/01

* కరీంనగర్‌లో బాబు అంతిమయాత్ర తీవ్ర ఉద్రిక్తతతో కొనసాగుతుంది. బస్టాండ్ వైపు తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కార్మికులకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట మధ్యన అంతిమయాత్ర కొనసాగుతుంది. బస్టాండ్ వైపు బాబు అంతిమయాత్రను తీసుకెళ్లేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
* విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎస్‌.ఆనందరామ్‌(92) హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 1982-83లో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. ఆ తర్వాత సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కూడా దిల్లీలో సేవలందించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకేసు విచారణాధికారిగానూ ఆనందరామ్‌ పనిచేశారు. 1987లో ఆనందరామ్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది
* దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లకు వ్యతిరేకంగా ఆమె మేనకోడలు దీప జయకుమార్‌ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమాలను విడుదల చేయకూడదని కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* బ్యూరో ఆఫ్‌‌ సివిల్‌‌ ఏవియేషన్‌‌ (బీసీఏఎస్‌‌) ఆదేశాల మేరకు హైదరాబాద్‌‌ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టు ప్యాసింజర్లకు బాడీస్కానర్‌‌ తనిఖీలను మొదలుపెట్టింది. మూడు నెలలపాటు ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. డొమెస్టిక్‌‌ డిపార్చర్‌‌ టెర్మినల్‌‌ వద్ద దీనిని అమర్చినట్టు ఎయిర్‌‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్‌‌ తెలిపింది.
* పోలవరం ప్రాజెక్టుకు మెగా సంస్థ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ప్రాజెక్ట్ వద్ద మెగా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ మురళి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. భూమిపూజ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. మరోవైపు బకాయి డబ్బులు చెల్లించాలంటూ సబ్‌కాంట్రాక్టర్లు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యంత్రాల తరలింపును అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో సబ్‌కాంట్రాక్టర్లు,
* తమకు రావల్సిన 8 నెలల జీతాలను చెల్లించాలంటూ.. చింతలపూడిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వంట చేసే వర్కర్లు శుక్రవారం ఉదయం సమ్మె చేపట్టారు.
* విశాఖ కైలాసపురం వద్ద ఖాళీ కంచాలతో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన మహిళా నేత ఉషాకిరణ్ మాట్లాడుతూ.. ఇసుక కోసం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
* దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టి ఆ సంచిని అక్కడ నుంచి తరలించారు. ఆ బ్యాగ్లో ఉన్నది ఆర్డీఎక్స్ లేదా ఐఈడీ పరికరం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. 24 గంటల పాటు బ్యాగ్ను పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని వెల్లడించారు.
* ఐసిస్‌ చీఫ్‌ అబుబకర్‌ అల్‌ బగ్దాదీ హతమయ్యాడంటూ అమెరికా చేసిన ప్రకటనను ఐసిస్‌ ధ్రువీకరించింది. బగ్దాదీ మృతి నిజమేనని నిర్ధారించింది. ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేసిన సంస్థ.. ఐసిస్‌కు కొత్త చీఫ్‌ను కూడా ప్రకటించింది. బగ్దాదీ వారసుడిగా ఇబ్రహీం అల్‌ హషిమి అల్‌ ఖురేషిని నియమించినట్టు పేర్కొన్న ఉగ్రవాద సంస్థ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. అలాగే, 2016 నుంచి ఐసిస్‌కు ప్రతినిధిగా ఉన్న బగ్దాదీ అనుచరుడు అబు హసన్‌ అల్‌ ముహజిర్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు ఐసిస్‌ తెలిపింది.
* లెక్టర్ వాహనం ముందుఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. అనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల వేధింపులు తాళలేక ప్రకాష్ అనే ఏఆర్ కానిస్టేబుల్… కలెక్టర్ సత్యనారాయణ వాహనం ముందు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడున్న తోటి పోలీసులు ప్రకాష్‌ను వారించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
*ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేకపోతున్న ఎయిర్‌టెల్ 3జీ సేవలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.
*ఏపీ పోలీసు అకాడమీ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీసు ట్రైనింగ్ విభాగపు ఐజీ ఎన్ సంజయ్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ తక్షణం ఈ బాధ్యతలు తీసుకోవాలని సంజయ్కు సూచించింది.
*ఉత్తర అండమాన్‌ సముద్రంలో రానున్న 48గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 5, 6 తేదీల్లో వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
*రాష్ట్రంలో 340 ఎస్సై, 11వేల 356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతివ్వాలంటూ ప్రభుత్వానికి పోలీసు నియామక మండలి ప్రతిపాదనలు పంపించింది. అన్ని ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఏటా జనవరిలో క్యాలెండర్‌ విడుదల చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఖాళీల వివరాలను పంపించింది.
*ప్రముఖ ప్రవచకుడు చాగంటి కోటేశ్వరరావుకు 3వ తేదీన గురు సత్కారం చేయనున్నారు. దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని లలితకళాతోరణంలో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో చాగంటిని సత్కరించనున్నట్టు నిర్వాహకులు మరుమాముల వెంకటరమణశర్మ తెలిపారు.
*హైదరాబాద్ రసూల్పుర కూడలిలో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణానికి వీలుగా అంతర్రాష్ట్ర పోలీస్ వైర్లెస్ కార్యాలయం పరిధిలోని 1.62 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు బదలాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
*మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఉన్న పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల ముందస్తు ప్రక్రియ సక్రమంగా జరగలేదంటూ 77కి పైగా మున్సిపాలిటీల నుంచి పిటిషన్లు దాఖలయ్యాయి.
*తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బస్సు డిపోల వద్ద గురువారం నిరాహార దీక్షలు నిర్వహించారు. కార్మికుల నిరవధిక సమ్మె గురువారం 27వ రోజుకు చేరుకుంది.
*ఐక్యత మరింత ఐక్యత అనే స్ఫూర్తి మంత్రాన్ని ప్రవచించి భారతదేశాన్ని ఏకం చేసే లక్ష్యాన్ని స్వయంగా స్వీకరించిన వల్లబ్భాయ్ పటేల్ ఆలోచనలు నేటికీ అత్యంత అనుసరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో గురువారం ప్రజ్ఞాభారతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
*రాష్ట్రంలో కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.2.5లక్షలకు పెంచింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కులవ్యవస్థ మహమ్మారిని రూపుమాపడంతో పాటు ఎస్సీలను జనజీవనంలోకి తీసుకువచ్చేందుకు ప్రోత్సాహకం పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
*రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తుపాను రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
*హైదరాబాద్ – నిజాముద్దీన్ (దిల్లీ) మధ్య నడుస్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ (12721/12722)లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల బోగీలు 22 ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 16.. విశాఖపట్నంనుంచి 6 బోగీలు బయల్దేరుతున్నాయి. కాజీపేటలో వీటిని లింక్ చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ఇదే పద్ధతి. తాజాగా ఆ లింక్ను తొలగించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. హైదరాబాద్ స్టేషన్ నుంచే 22 బోగీలతో ఈ రైలును నడపనుంది.
*తెలంగాణలో ఔషధనగరి, జహీరాబాద్ నిమ్జ్ వంటి 13 కొత్త పారిశ్రామిక వాడలకు ప్రభుత్వం పారిశ్రామిక స్థానిక ప్రాధికార సంస్థ (ఐలా) హోదా కల్పించింది. వీటిపై గ్రామ పంచాయతీల అధికారాలు, విధులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)కి బదలాయిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ గురువారం ఉత్తర్వులు (జీవో నెం. 59) జారీ చేశారు.
*ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారని డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుజరాత్లోని వడోదరలో జరుగుతున్న పోలీసు సాంకేతిక ప్రదర్శనలో ఏపీ పోలీసుశాఖ ఏర్పాటుచేసిన స్టాల్ను ప్రధాని గురువారం సందర్శించారని.. ఏపీ పోలీసుశాఖ అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, పోలీసులకు వారాంతపు సెలవు గురించి అడిగి తెలుసుకుని వాటిని ప్రశంసించారని పేర్కొంది.
*అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు పొరపాటున సమాచారంలో తప్పులు దొర్లిన అభ్యర్థులకు.. వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని పోలీసు నియామక మండలి కల్పించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ పోలీసు నియామక మండలి వెబ్సైట్లోకి వెళ్లి ‘ఎడిట్’ ఆప్షన్ ద్వారా వివరాలు సరిచేసుకోవచ్చు.