NRI-NRT

ఉత్తర కరోలినాలో అనుమానస్పదంగా మృతిచెందిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Telugu Software Engineer Shiva Chalapati Raju Dies In North Carolina-ఉత్తర కరోలినాలో అనుమానస్పదంగా మృతిచెందిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతి రాజు మంగళవారం మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏ కారణంతో చనిపోయారన్న వివరాలు తెలియరాలేదు. ఆయన ఫేస్‌బుక్‌ వివరాలను బట్టి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. వీరి దరఖాస్తు బ్యాక్‌లాగ్‌ జాబితాలో ఉంది. రాజు అకాల మరణంతో ఆయన భార్య గర్భిణి అయిన సౌజన్య తిరుగు ప్రయాణం అయ్యారు. రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాజు కొన్నేళ్లుగా నార్త్‌ కరోలినాలో ఉంటున్నారు. పలు కంపెనీల్లో పనిచేశారు. రాజు మృతదేహాన్ని స్వదేశం తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చేందుకు పీడిమాంట్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ (పాటా) ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. ఆయన మృతదేహాన్ని భారత్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పుర్తి అయ్యాయని అందులో పేర్కొన్నారు.