1. నేటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్ర అవతరణ వేడుకలు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని 3 రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
2. నేటి నుంచి కొత్త ఎక్సైజ్ విధానం.
తెలంగాణలో కొత్త ఎక్సైజ్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తోంది. 2019-21 సంవత్సరాలకు ఈ విధానం పట్టాలెక్కించేందుకు ఇటీవలే ఎక్సైజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 2,216 దుకాణాలకు కొత్తగా లైసెన్స్‌లు పొందిన వ్యాపారులు ఇక నుంచి విక్రయాలు సాగించనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1467కోట్ల భారీ మొత్తం సమకూరింది.
3. నేడు దేశంలోనే తొలి చిన్న పరిశ్రమల పార్కు ప్రారంభం
దేశంలోనే తొలిసారి పూర్తిగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం నెలకొల్పిన ప్రత్యేక హరిత పరిశ్రమల పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌కు 40 కి.మీ. దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో నిర్మించారు. దీనికి ‘ఐలా’ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
4. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి రాబోతుంది. ప్రస్తుత విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఆన్‌లైన్ విధానాన్ని ఐచ్ఛికంగా (ఆప్షన్) అమలు చేయనున్నారు. అక్టోబరు తొలివారం నుంచి ఈ విధానాన్ని కృష్ణా, విశాఖ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు.
5. బాధిత ఎస్సీ, ఎస్టీలకు పింఛను, ఉద్యోగం
ఎస్సీ, ఎస్టీలపై. వేధింపులు, అత్యాచారాల నిరోధక చట్టం కింద బాధితులకు పునరావాస నిధి నుంచి అదనపు సహాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై హత్యలు, ఊచకోత, అత్యాచారం, సామూహిక అత్యాచారం, హింసాత్మక దాడులు జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యుడు లేదంటే భార్యకు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం పింఛను ఇవ్వనుంది.
6. మూడు వేల గురుకుల పోస్టుల భర్తీకి ప్రకటనలు సిద్ధం
తెలంగాణలోని గురుకులాల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లో పోస్టులు, ప్రభుత్వం అనుమతించినా ప్రకటనలు వెలువరించనివి కలిపి ఇవ్వనుంది. ఇప్పటికే సొసైటీల నుంచి కొత్త జోనల్ విధానం మేరకు వచ్చిన 2200 పోస్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. మరి కొన్ని పోస్టులు కలిపి 3వేల ఉద్యోగాలకు సర్కారు అనుమతి లభిస్తే వీలైనంత త్వరగా ప్రకటనలు వెలువడనున్నాయి.
7. మీడియాకు సంకెళ్లా?
పత్రికలు, టీవీ ఛానళ్లు, ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు, పోస్టింగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే కేసులు పెడతామంటూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2430 జీవోపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా, ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ రూపాల్లో నిరనస వ్యక్తం చేశారు. తెదేపా నిరసన వ్యక్తం చేస్తూ జీవో ప్రతులను దహనం చేసింది. ప్రభుత్వం చీకటి ఉత్తర్వులిచ్చిందని మండిపడింది.
8. హెచ్‌ఐవీ రోగుల్లో ఏపీకి రెండోస్థానం
దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగుల్లో ఆంధ్రప్రదేశ్ రెండో, తెలంగాణ అయిదో స్థానంలో నిలిచాయి. 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఈ మహమ్మారితో బాధపడుతుండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారు. బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
9. సీఎం దవిపై శివసేన ఉడుం పట్టు!
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. చెరిసగం కాలం పాలన (50:50 ఫార్ములా)’పై గట్టిపట్టుతో ఉన్న శివసేన బుధవారం కొంత మెత్తబడినట్లు కనిపించినా.. మరుసటి రోజే స్వరం పెంచింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ‘ప్రత్యామ్నాయాలను’ చూస్తోందంటూ వస్తున్న ఊహగానాలకు ఊతమిచ్చే దిశగా అడుగులేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌తో శివసేన నేత రౌత్ భేటీ కావడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం పట్టు వదల్లేదంటూ శివసేన గురువారం సంకేతాలిచ్చింది.
10. ఆఖరి పోరాటం
భారత పురుషులు, మహిళల జట్లకు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరి అవకాశం! ముఖ్యంగా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధిస్తే టోక్యోకు టిక్కెట్ సంపాదించే అవకాశాన్ని చేజార్చుకున్న భారత పురుషుల జట్టుకు సిసలు సవాల్. ఒలింపిక్స్‌కు వెళ్లాలంటే క్వాలిఫయర్స్‌లో పురుషుల జట్టు రష్యాను, మహిళల జట్టు యుఎస్‌ఏను ఓడించాల్సి
నేటి పది ప్రధాన వార్తలు-11/01
Related tags :