WorldWonders

చైనా 5జీ ప్రారంభం. కోటి మందికి సేవలు.

China Begins 5G. Serves 10Million Citizens.చైనా 5జీ ప్రారంభం. కోటి మందికి సేవలు.

5జీ సాంకేతికత పరిజ్ఞానంలో అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలను అధిగమించాలని యోచిస్తున్న చైనా ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఆ దేశ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన చైనా మొబైల్‌, చైనా యూనికాం, చైనా టెలికాం..5జీ డేటా ప్రణాళికలను విడుదల చేశాయి. 128యువాన్ల నుంచి 599 యువాన్ల వరకు నెలవారీ ధరల శ్రేణిని ఇందుకు నిర్ణయించాయి. బీజింగ్‌, షాంఘై సహా దాదాపు 50 నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నాయి. వచ్చే ఏడాది నాటికి 10కోట్ల 70లక్షల మంది చందాదారుల్ని చేర్చుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే షాంఘైలో 5జీకి సంబంధించిన 11,859 బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అధికారికంగా విడుదల చేయడానికి ముందే 10మిలియన్ల మంది 5జీ సేవలకు రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఓ సర్వే తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్న 4జీ కంటే 5జీ సేవలు పది నుంచి 100రెట్లు వేగంగా పనిచేస్తాయి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే డ్రైవర్‌లెస్ కార్‌ వంటి అత్యాధునిక సాంకేతికత ప్రజలకు చేరవకానుంది. వాణిజ్య, సాంకేతిక రంగాల్లో అమెరికా, చైనా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో చైనా ఈ దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకొంది. త్వరలో 5జీ సాంకేతికతను భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని డ్రాగన్‌ ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 5జీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో చైనాకు చెందిన హువావే కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.