* కరకట్ట అక్రమ కట్టడాలపై వివరణ ఇవ్వాలని యజమానులకు హైకోర్టు ఆదేశం. ఆరువారాల్లోపు కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పిన ధర్మాసనం. అక్రమ నిర్మాణాలపై పిర్యాదు చేసినా అధికారులు _పట్టించుకోలేదంటూ 2017 లో పిల్ వేసిన ఎమ్మెల్యే ఆర్కే. పిటీషన్ లో లింగమనేని రమేష్ తో పాటు 49 మందిని ప్రతివాదులుగా చేర్చిన ఆర్కే. నోటీసులు అందనివారికి మరోసారి నోటీసులు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించిన న్యాయస్థానం.
* సత్తుపల్లిలో దొంగ నోట్ల ముఠా అరెస్టు, అయిదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న సత్తుపల్లి పోలీసులు. రద్దు అయిన నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తామని మోసం. కొత్త నోట్లు ఉన్నాయంటూ అమాయకులను బురిఢీ కొట్టిస్తున్న ముఠా. తెలుగు రాష్ట్రాలలో దొంగ నోట్ల ముఠా హల్ చల్. ఆశకు పోయి …అమాయకులు బలి కావద్దు.
* ‘ఆదాయపు పన్ను రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టండి’ అంటూ మీ మొబైల్‌కు ఏమైనా మెసేజ్ వచ్చిందా..? జాగ్రత్త! అది నకిలీ మెసేజ్. అలాంటివి వచ్చినప్పుడు వెంటనే సైబర్ అధికారులకు ఫిర్యాదు చేయండని హెచ్చరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొంది. ‘ఆదాయపు పన్ను రీఫండ్ కోసం రిక్వెస్ట్ పంపాలని ఐటీ శాఖ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా? ఆ మెసేజ్‌లు నకిలీవి. సైబర్ మోసగాళ్ల సరికొత్త పంథా ఇది. అలాంటివి వచ్చినప్పుడు అందులో ఇచ్చిన లింక్‌లను క్లిక్ చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయండి’ అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ప్రజల అవగాహన కోసం ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. ఆ నకిలీ మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే సైబర్ మోసగాళ్లు ఐడీ, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నారు. వాటి సాయంతో అకౌంట్లలోని డబ్బులను దోచుకుంటున్నారని ఎస్‌బీఐ హెచ్చరించింది.
* మారుతీ సుజుకి వ్యాన్ లో అక్రమం గా తరలిస్తున్న హన్స్ ప్యాకెట్లు .. మారుతీ వ్యాను సీజ్. నెల్లూరు జిల్లా వెంకటగిరి లోని రాపూరు సర్కిల్ వద్ద తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతీ సుజుకి వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 50 వేల రూపాయలు విలువచేసే 197 హన్స్ ప్యాకెట్లు ను,మారుతీ వ్యాను ను సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేసిన వెంకటగిరి ఎస్ఐ వెంకట రాజేష్ .
* కృష్ణ జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంచార్జ్ ఆర్.ఎం.ఓ. విజయనిర్మల నిరాహార దీక్ష. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్ష నిర్ణయంతో ఆర్.ఎం.ఓ విధులనుండి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ డా. విజయ నిర్మల ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు పూర్తి న్యాయం జరిగేవరకు దీక్ష విరమింపజేసేది లేదని తెలియజేసారు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాపై విడుదల చేసిన 2430 జీఓ అంశాన్ని సూమోటో గా తీసుకున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ప్రధాన కార్యదర్శి, సమాచార ముఖ్యకమిషనర్ కి నోటీసులు జారీ చేసిన ప్రెస్ కౌన్సిల్.
* ఉగ్రదాడి .. 55 మంది సైనికులు మృతి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రదాడి జరిగింది. ఓ మిలిటరీ పోస్టుపై జరిగిన దాడిలో సుమారు 53 మంది సైనికులు మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మేనక ప్రాంతంలో ఉన్న ఓ ఔట్‌పోస్టును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఇటీవలే ఓ నెల రోజుల క్రితం బుర్కినో ఫాసోలో ఇద్దరు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతిచెందారు. అయితే శుక్రవారం జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఉత్తర మాలి ప్రాంతంలో ఆల్‌ఖయిదా ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌తో ఉగ్రవాదులు ప్రతిదాడులకు దిగుతున్నారు.
* తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట నేషనల్ హైవే పై రోడ్డుప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
* విశాఖ నగరం నడిబొడ్డున గంజాయి కలకలం రేగింది. అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. ముఠాలో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు యువకులు ఉన్నారు. చదువు పేరుతో కొందరు యువతీ, యువకులు విశాఖలో అద్దెకు రూమ్‌లు తీసుకుని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
* హైదరాబాద్, హయత్‌నగర్: ఒక వ్యక్తి వల్ల గర్భం దాల్చి… మరో వ్యక్తి బ్లాక్ మెయిలింగ్‌కు వశమై… ఏకంగా కన్నతల్లినే మట్టుపెట్టిన కీర్తి ఇప్పటికీ తన మొదటి ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. జైలుపాలైన ఆమె ప్రవర్తన, మాటతీరు, నేపథ్యం ఆరా తీస్తున్న పోలీసులకు పలు విషయాలు వెల్లడవుతున్నాయి. బాల్‌రెడ్డి వల్ల గర్భవతి అయి… అబార్షన్ చేయించుకున్న ఆమె అతడినే వివాహమాడతానని చెప్పింది. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో తల్లి రజిత (38)ను హత్య చేసిన కీర్తి తన 16 ఏళ్ల వయసులోనే మొదటి ప్రియుడు బాల్‌రెడ్డికి దగ్గరైంది. ఏ విషయమైనా అతనితోనే పంచుకునేది. తల్లి లేనప్పుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లేది. గత ఏడాది సెప్టెంబరులో గర్భం దాల్చినట్టు ఆమెకు అనుమానం వచ్చింది. అప్పుడు బాల్‌రెడ్డి బెంగళూరులో ఉన్నాడు.
* చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీలు చేపట్టిన ఎయిర్‌పోర్టు అధికారులు 2.33 కిలోల బంగారం, 10వేల అమెరికన్ డాలర్టను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, సింగపూర్ నుంచి బంగారం తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
* హైదరాబాద్:-చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ప్రయివేటు బస్సు ఢీకొనడంతో మహిళ మృతి. సైదాబాద్ కు చెందిన కావ్య అనే 23 సంవత్సరాల మహిళ తన స్కూటీ పై వెళ్తుండగా , నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద TS UA 5330 గల ప్రయివేటు బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా , సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును , డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని , పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించిన పోలీసులు.
* మహారాష్ట్రలోని పూణే నగరంలోని రైల్వేస్టేషనులో శనివారం ఉదయం ఓ హ్యాండ్ గ్రెనెడ్‌ను రైల్వేపోలీసులు కనుగొన్నారు. అత్యంత రద్దీగా ఉండే పూణే రైల్వేస్టేషనులో హ్యాండ్ గ్రెనెడ్ లభించడంతో పూణే పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను రప్పించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ హ్యాండ్ గ్రెనెడ్‌ను ధ్వంసం చేశారు. హ్యాండ్ గ్రెనెడ్ అవశేషాలను పరీక్షించేందుకు పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషనులో హ్యాండ్ గ్రెనెడ్ ఎవరు పెట్టారనే విషయంపై రైల్వేపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషనులో పేలుడు సృష్టించేందుకే హ్యాండ్ గ్రెనెడ్ వదిలివెళ్లారా అనే కోణంలో పూణే ప్రత్యేక పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ ఘటనతో పూణే రైల్వేస్టేషనులో ప్రయాణికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
* శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తున్న వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కు తప్పిన పెను ప్రమాదం. జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్ ఫేచర్ అయిన విషయాన్ని ముందుగానే ట్రైన్ డ్రైవర్ కి తెలియజేసిన కీ మేన్. అప్రమత్తమైన రైలు డ్రైవర్, చాకచక్యంగా రైలును నిలిపి వేసిన డ్రైవర్. తప్పిన పెను ప్రమాదం. గంటన్నర పాటు నిలిచి పోయిన రైలు, హుటాహుటిన రైల్ ఫేచర్ మరమ్మత్తు చేసిన రైల్వే సిబ్బంది. కొద్ది సేపటి క్రితం తిరిగి బయలుదేరిన రైలు.