భారత్ X వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్‌కౌర్ అద్భుత క్యాచ్ పట్టింది. బౌండరీ లైన్ వద్ద ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో విండీస్ కెప్టెన్ స్టఫానీ టైలర్(94; 91 బంతుల్లో 8×4, 2×6) త్రుటిలో శతకం చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు ఒక్క పరుగుతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. స్టఫానీ చివరిబంతికి సిక్స్ కొట్టి శతకం పూర్తి చేసుకోవాలని భావించగా హర్మన్‌ప్రీత్ అద్భుతక్యాచ్ అందుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 169 పరుగులకు రెండువికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా 55 పరుగుల తేడాలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 224 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఓటమిపాలైంది. రెండో వన్డే ఆదివారం జరగనుండగా మూడో వన్డే బుధవారం జరగనుంది. వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్లు ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాయి.
మహిళల క్రికెట్ జట్టు ఓడింది
Related tags :