Movies

కిరాణా దుకాణాల ఆగ్రహం

Medium Scale Business Shops To Protest Against Vijay Sethupathi

కొంత కాలంగా విజయ్‌ సేతుపతి ఎక్కువగా ప్రకటనల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన ‘మండి’ అనే ఆన్‌లైన్‌ కిరాణా సరకుల యాప్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనలు, వీడియోలు వస్తున్నాయి. అయితే సాధారణ కిరాణా వ్యాపారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి దుకాణాలతో జీవనం సాగిస్తున్న తమ కడుపులు కొడుతున్న ఇలాంటి వ్యాపార సంస్థలకు విజయ్‌సేతుపతి వంటి యువ నటుడు చేయూతనివ్వడం సముచితం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 4వ తేదీన చెన్నైలోని విజయ్‌సేతుపతి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. దీనిపై విజయ్‌ సేతుపతి ఇంకా స్పందించ లేదు.