Politics

అయినా సిగ్గు రాలేదు

Vijayasai Reddy Fires On Chandrababu Calling Him Shameless

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని, అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా ప్రజాధనాన్ని దోచుకున్నాడని విజయ సాయిరెడ్డి ట్విటర్లో ఆరోపించారు.

‘ప్రజలు ముఖాన తుపుక్కున ఉమ్మేసి ఆరు నెలలు కూడా కాలేదు. పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారు.

చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా వీళ్లకు సిగ్గనిపించడం లేదు. పచ్చ మీడియా ప్రచారం దొరుకుతుందేమో కాని మరో పదేళ్లయినా ప్రజాభిమానం సంపాదించుకోలేరు.

ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికాడు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నాడు.

40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉంటున్నాడు. ప్రజలు గుర్తించబట్టే అధికారం పీకేసి తరిమికొట్టారు.

అయినా నిప్పు-తుప్పు అని రంకెలేస్తున్నాడని’ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.