దీపిక.. మీరు త్వరలో ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటూ ఓ అభిమాని ఆమెను సోషల్‌మీడియా వేదికగా అడిగారు. బాలీవుడ్ సుందరి దీపికా పదుకొణె దీపావళి పండుగను పురస్కరించుకుని.. తన చిన్నతనానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘పోస్ట్ దీవాళి సెలబ్రేషన్’ అని దీపిక పేర్కొన్నారు. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు.. ‘ఓ మై గాడ్ శుభవార్త’, ‘అభినందనలు’, ‘త్వరలో మీరు ఏమైనా గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారా?’ అంటూ కామెంట్ల రూపంలో దీపికను అడుగుతున్నారు. దీపిక.. తన చిన్నప్పటి ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ నటి తను సంబంధించిన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కాకపోతే దీపిక నెలల పాపగా ఉన్నప్పటి ఫొటోలను మొదటిసారి ఇలా షేర్ చేశారు.
దీపికా…ఈ చిత్రం అర్థమేమి?
Related tags :