* రెండు కార్లు ఢీ కొని ఇద్దరు మృతి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు రవాణా చెక్ పోస్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో, ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలో మృతిచెందగా, ఒకరి జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో మృతి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, విజయవాడకు తరలింపు. రోడ్డు ప్రమాద సంఘటనలో మరొకరు మృతి. మొత్తం నలుగురు మృతి..
* భవానీపురం సాయిత్రిశక్తి నిలయం పీఠంలో పూజలు నిర్వహిస్తున్న పురోహితునిపై నలుగురు మహిళలు సామూహిక దాడిచేసి గాయపర్చిన సంఘటపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.
* శీతల పానీయంలో మత్తుమందు కలిపి, ప్రయాణికురాలి వద్ద నగదు, బంగారం చోరీ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొగల్రాజపురానికి చెందిన కంకారపు రమణాయమ్మ వివిధ పనుల నిమిత్తం స్వస్థలమైన విశాఖపట్నం వెళ్లారు. తిరిగి విజయవాడ రావడానికి శుక్రవారం సాయంత్రం 7గంటలకు విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సెక్కారు.. ఈ క్రమంలో సుమారు 55ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఆమె పక్క సీటులో కూర్చుని నువ్వు నా కుమార్తె లాంటిదానివంటూ పరిచయం చేసుకుని కొద్దిసేపు సంభాషించాడు. మధ్యలో బస్సును భోజనాల నిమిత్తం ఆపడంతో అతడు కిందకు దిగి శీతలపానీయంతో వచ్చి నీరసంగా ఉన్నావు.. తాగమని రమణాయమ్మను బలవంతం చేశారు. అది తాగిన కొద్దిసేపటికి ఆమె నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి బస్సు పీఎన్‌బీఎస్‌కు చేరుకోగా.. నిద్రిస్తున్న ఆమెను డ్రైవర్ వచ్చి లేపాడు. అనంతరం చూసుకుంటే తన మెడలో ఉండాల్సిన రెండున్నర కాసుల బంగారు చెయిన్ మాయమైంది.
* సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిరిండియా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 గంటలకు ముంబైకి వెళ్లాల్సిన ఎయిరిండియా-966 విమానాన్ని రద్దు చేసిన సంస్థ.. రాత్రి 8.40కి మార్చినట్టు ప్రకటించింది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సిబ్బంది ఈ విషయాన్ని చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే తీవ్ర నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో సిబ్బందిని నిలదీశారు.
* వరంగల్: గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి చెందారు. హన్మకొండ డిపోకు చెందిన రవీందర్‌కు నాలుగు రోజుల క్రితం గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్త ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరకాల డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
* నల్గొండ జిల్లాలో చందంపేట మండలం కంబాలపల్లిలో ఆదివారం ఉదయం గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసింది. గొర్రెలు మేస్తుండగా కాపరి గోవింద్‌పై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో గొర్రెలకాపరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
* విశాఖపట్నంలోని సిరిపురం వుడా చిల్డర్డ్స్ ఎరీనా పార్క్‌లో సిట్ ఫిర్యాదుల స్వీకరణ మూడో రోజు ప్రారంభమైంది. సిట్‌కు ఫిర్యాదు చేయడానికి మూడో రోజు అధిక సంఖ్యలో వస్తుండడంతో సిట్ సభ్యులు అనురాధ, భాస్కర్ రావు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు వచ్చిన 236 ఫిర్యాదుల్లో 41 సిట్ పరిధిలోకి రాగా, మిగతా 195 దీని పరిధిలోకి రాలేదు. కాగా, రెండవ రోజున మొత్తం 27 సిట్ ఫిర్యాదులు రాగా వాటిలో ఆన్లైన్లో ఏడు, భీమునిపట్నం మూడు, గాజువాక రెండు, గోపలపట్నం ఒకటి, పరవాడ మూడు, పద్మనాభం ఒకటి, పెందుర్తి ఆరు, సబ్వరం రెండు ఉన్నాయి. రెండవరోజు తమ భూములు ట్యాంపరింగ్ జరిగాయంటూ స్వాతంత్ర సమరయోధుల వారసులు సిట్‌కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం తమను మోసం చేసి మా భూములు లాక్కొని తగిన నష్ట పరిహారం కూడా చెల్లించలేదని మెడ్‌టెక్ బాధితులు ఆరోపించారు.
* అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 16మందికి తీవ్ర గాయాలయ్యాయి. పామిడికి చెందిన కుటుంబసభ్యులు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని గ్రామానికి తిరిగి వెళ్లే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఆరుగురు చిన్నారులు ఉండగా, మనోజ్ అనే నాలుగేళ్ల చిన్నారి ఎడమలు తెగిపడింది. క్షతగాత్రులకు తల, కాళ్లకు బలమైన గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీఎస్పీ ఖాసీం సాబ్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందే వైద్యసేవలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
* ఏసీబీ అక్రమ కేసుల బాధితుల మీడియా సమావేశం. వెంకటేస్వరావు బాధితుడు కామెంట్స్. గత ప్రభుత్వంలో నాయకుల మెప్పుకోసం ఆర్పీ ఠాకూర్ ట్రాప్ చేసి అక్రమ కేసులలో బుక్ చేశారు. ఠాకూర్ డీజీ నుంచి డీజీపీ ప్రమోషన్ కోసం అక్రమంగా కేసులు పెట్టారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగాక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు అండా నిలిచారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాటిపై ఐపవర్ కమిటీ ఎర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని ఉద్యోగులు కొందరు ఠాకూర్ పెట్టిన అక్రమ కేసులకు ఆతహత్యలు చేసుకున్నారు. మాకు న్యాయం చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాము.
* హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆక్సిజన్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ తో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృతి చెందిన సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎంపీ గోరంట్ల మాధవ్.
సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్ పై రికవరీ యాక్ట్ అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.
* ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. విధుల్లో చేరేందుకు పలు డిపోలకు ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 30 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఎల్లుండిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను వీడి విధుల్లో చేరుతున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాచలం డిపోలలో కార్మికులు విధుల్లో చేరుతామని లేఖలు ఇచ్చారు. సిరిసిల్ల డిపో మెకానిక్ శ్రీనివాస్, సిద్దిపేట డిపో కండక్టర్ విశ్వేశ్వరరావు విధుల్లో చేరారు. విధుల్లో చేరే కార్మికులకు రక్షణ కల్పిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.