ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ భారత్‌లోని కొందరి ఫోన్లలో వాట్సప్‌లోకి చొరబడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పైవేర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్‌లోకి కూడా చొరబడిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇప్పటివరకూ ఈ స్పైవేర్ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లలో చొరబడిందని అన్నారు. ప్రియాంక సహా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్‌ల ఫోన్లను ఈ స్పైవేర్ పేరుతో ప్రభుత్వమే హ్యాకింగ్ చేయించిందని సుర్జేవాలా ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రియాంకా గాంధీ వాట్సాప్‌పై మాల్‌వేర్ దాడి
Related tags :