ఒకనాడు భగవాన్ బుద్ధుడు ఉక్కట్టా,సేతవ్యల మధ్య రాజమార్గాన పయనిస్తున్న్నాడు. అదే సమయంలో దొణ( ద్రోణుడు) అనే బ్రాహ్మణుడు ఆ మార్గం లో వెళుతున్నాడు.
బుద్ధుడు ఒక చెట్టు కింద ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. ఆ సమయంలో బుద్దుని దొణ ఈ విధంగా అడిగాడు…దొణ:- “అయ్యా. మీరు దేవుడు కదా?”
☸బుద్ధుడు:- “నేను దేవున్ని కాదు బ్రాహ్మణా….”
దొణ:- “అయ్యా మీరు గాంధర్వులు అయి ఉండరు కదా?”
☸ బుద్ధుడు:-” నేను గంధర్వుడు కాదు బ్రాహ్మణా ”
దొణ :- ” అయ్యా… మీరు యక్షుడా?”
☸ బుద్ధుడు:- నేను యక్షుడను కాదు బ్రాహ్మణా ”
దొణ:-” అయ్యా మీరు మామూలు మనిషి కదా?”
☸ బుద్ధుడు:- “నేను మామూలు మనిషిని కూడా కాదు బ్రాహ్మణా ”
దొణ:-” అయ్యా మీరు దేవుడు కాదు,గంధర్వుడు కాదు,యక్షుడు కాదు,మామూలు మనిషి కూడా కాదు అంటున్నారు. మరి మీరు ఎవరు?”
☸ బుద్ధుడు:-” బ్రాహ్మణా…
నేను కోరికలు, దురాక్రమణలు,విస్తరణ బుద్ది, హోదాలు, అధికార కాంక్ష, ఇతరుల మీద అధికారం చెలాయించడం అనే ఆశలు వదిలేశాను. కావున నేను దేవుడను కాదు.”
“నేను జనాలను ఆకర్షించే ఎలాంటి గానం,నాట్యం, ప్రదర్శనలు చేయడం లేదు .కాబట్టి నేను గంధర్వుడను కాను.”
“నేను ఎలాంటి మాయా మంత్రం విద్యలు,వశీకరణ విద్యలు,గారడీ విద్యలు చేసి ప్రజలలో నిలవాలని కోరుకోవడం లేదు. కాబట్టి నేను యక్షుడను కాను”
“నేను వివిధ ఆశలు,వ్యామోహాలు, గుడ్డిగా నమ్మకాలు, ఎవరేది చెప్పిన వెంబడిస్తూనే ఉండడం చేయడం లేదు కావున నేను మామూలు మనిషిని కూడా కాదు”
“ఓ బ్రాహ్మణా… నన్ను బుద్దుని గా గుర్తించు. నేను ఆశలను మొదటికంటూ తుంచాను.మళ్ళీ మొదలకుండా చేశాను. కొలనులో పద్మం బురదలో పుట్టి,బురదలో పెరిగి బురద అంటకుండా వికసించినట్లు నేను మానవులలో బుద్ధుడుగా వికసించాను”