టిక్‌టాక్ అభిమానులకు శుభవార్త. టిక్ టాక్ మాతృ సంస్థ ‘బైట్ డ్యాన్స్’ తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3’ (నట్ ప్రో 3) పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్లో లాక్ స్ర్కీన్ మీద ఒక్క టచ్ చేయటంతో టిక్ టాక్ యాప్‌ని ఓపెన్ చెయ్యవచ్చని సంస్థ తెలిపింది. సెల్ఫీ లైటింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. స్మార్టిసాన్ ఓఎస్ 7 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే వేరియంట్ గురించి సంస్థ ఎటువంటి ప్రకటనా చేయలేదు. 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను ఇస్తున్నారు. ఈ ఫోన్లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. ముందు వైపు 4 ఇన్ 1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో 20 ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీని సాయంతో ప్రకాశవంతమైన ఫొటోలను తీసుకోవచ్చు. వెనక సోనీ ఐఎమ్ఎక్స్ 586 సెన్సార్‌తో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనితో పాటుగా వైడ్ యాంగిల్ 13 ఎంపీ కెమెరా, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్, టెలీ ఫొటో లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాలను అమర్చారు. వీటికి 5 ఎంపీ మాక్రో కెమెరా అదనం. ఇందులోని 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 మూడు వేరియంట్లలో లభ్యమవుతంది. 8జీబీ /128జీబీ ధర 2,899 యువాన్లు (సుమారుగా రూ.29,000). 8జీబీ/ 256జీబీ వేరియంట్ ధర 3,199 యువాన్లు (సుమారుగా రూ.32,000). ఈ రెండు వేరియంట్లు బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇక 12జీబీ/256 జీబీ వేరియంట్ ధర 3,599 యువాన్లు (సుమారుగా రూ.36,000). ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో మాత్రమే అమ్మకానికి ఉంది. ఇతర దేశాల్లో ఎప్పుడు అమ్మకానికి రానుందనే దానిపై స్పష్టత లేదు.
TikTok ఫోన్ వచ్చేసింది
Related tags :