రాజధానిలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ‘తెలుగు అకాడమీ’ని ఏర్పాటు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు ఎంతోమంది ఉన్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. ఆదివారం నిర్వహించిన దిల్లీ తెలుగు అకాడమీ (డీటీఏ) 32వ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. తెలుగు వారి సన్మానం పొందడం ఆనందాన్ని కలిగించిందని, గర్వంగా ఉందని కేజ్రీవాల్ తెలిపారు. జస్టిస్ పీఎస్ నారాయణ, సినీనటులు రాజేంద్రప్రసాద్, సుమన్, జబర్దస్త్ అప్పారావు, సుధాకర్… డీటీఏ పురస్కారాలను అందుకున్నారు. పురస్కార గ్రహీతలను కేజ్రీవాల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకల్లో ఆప్ నేత సోమనాథ్ భారతి, మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు, డీటీఏ ప్రధాన కార్యదర్శి నాగరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో తెలుగు అకాడమీ ఏర్పాటుకు కేజ్రీవాల్ హామీ
Related tags :