Politics

అయ్యన్న సోదరుడు వైకాపాలోకి జంప్

Ex TDP Minister Ayyannapatrudus Brother Joins YSRCP

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న టిడిపిని వీడి వెళ్లడానికి నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఒకపక్క టిడిపి అధికార పార్టీని ఎదుర్కొంటూనే, మరోపక్క సొంత నేతలు కాపాడుకోడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీలో కొనసాగితే అధికార పార్టీ నుండి వేధింపులు ఎక్కువ అవుతాయని, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగలనుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజీనామా చేసిన మరొక కీలక నేత వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 4 వ తేదీన అంటే నేడు వైసీపీ పార్టీ లో చేరడానికి సన్యాసి పాత్రుడు రెడీ అవుతున్నట్లు గా ప్రధానంగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన తన కుటుంబసభ్యులు, ఇతర నేతలతో కలిసి తాడేపల్లి కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సన్యాసి పాత్రుడు వైసీపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.అయితే గత ఎన్నికల ముందే సన్యాసి పాత్రుడు వైసీపీల చేరతానని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడు వైసీపీ లో చేరడానికి సన్యాసి పాత్రుడు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఫైనల్ గా నేడు అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టిడిపి కి పెద్ద షాక్ అని చెప్పాలి.