గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ఇది మన శరీరంలో మొదలై, అలానే కొనసాగుతుంటే.. వరుసగా మరికొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నిండిన అనుభూతి ఉండడం.. తిమ్మిరి ఇలా ఉంటూనే గుండె దగ్గర మంటగా ఉంటుంది. వైద్యపరంగా అపానవాయువు (ఫ్లాట్యులెన్స్) అని వీటిని పిలుస్తారు. ఇది మీ జీర్ణ వ్యవస్థలో అదనపు వాయువుని కలిగి ఉంటుంది. అసలు సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోవడం కీలకం. ఇది మీ జీర్ణవ్యవస్థలో గ్యాస్ రెండు విధాలుగా ఏర్పడుతుంది.తినేటప్పుడు, తాగేటప్పుడు లేదా నిద్రలో గురక పెట్టే సమయంలో మీరు మీ శరీరంలోకి ఆక్సిజన్ మరియు నత్రజనితో కూడుకుని ఉన్న గాలిని మింగడం సర్వసాధారణం. రెండోది, మరింత ముఖ్యమైన కారణమేంటంటే, మీ శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువ మోతాదులో విడుదలవు తుంటాయి. ఇవి మీ కడుపులో పేరుకు పోతుంటాయి. ఇవి బయటకు విడుదల కాకపోవడంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే, ఇక్కడ మీరు సహజంగా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని కొన్ని వంటగదిలో దొరికే ఆహారపదార్థాలను ఎంచుకోవచ్చు. గ్యాస్ నివారణకోసం సూచించిన అద్భుతమైన గృహ నివారణా చిట్కాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవి మీకు ఎంతగానో సహాయపడగలవు.
వాము : ‘వాము లేదా అజ్వైన్ విత్తనాలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది!’ అని బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజుసూద్ వివరించారు. మంచి ఫలితాలను పొందడానికి రోజులో ఒకసారి అర టీస్పూన్ వామును నీటితో కలిపి వేడి చేసి, తాగొచ్చు..జీలకర్ర: జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం. ‘జీరా (జీలకర్ర) లో కొన్ని ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. ఇవి క్రమంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయ పడతాయి. అదనపు వాయువు ఏర్పడకుండా చేస్తాయి!’ అని డాక్టర్ సూద్ వివరించారు. టేబుల్స్పూన్ జీలకర్ర తీసుకొని, రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు మరగబెట్టండి. దానిని చల్లార్చి, ఆపై వడకట్టి, నీటిని మీ భోజనం పూర్తిచేసిన తర్వాత సేవించండి.అల్లం : డాక్టర్ వసంతలాడ్ సూచన ప్రకారం, గాస్ట్రిక్ సమస్యకు తగ్గించేందుకు భోజనం అనంతరం టీస్పూన్ తాజా అల్లం తురుమును, టీస్పూన్ నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. అల్లం టీ తాగడమూ గ్యాస్ ఉపశమనానికి సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడుతుంది. అల్లం సహజమైన కార్మినేటివ్ (అపానవాయువు నుండి ఉపశమనం కలిగించే ఏజెంట్లు) గా పనిచేస్తుంది.
నిమ్మ: జీర్ణ సమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ వసంతలాడ్ సూచించిన మరో సులభమైన గృహ చిట్కా నివారణ ఏమిటంటే, టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను కప్పు నీటితో కలిపి సేవించడం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు.వాస్తవానికి అపానవాయువు అనేది ఒక సాధారణమైన శారీరక ప్రక్రియ. ఈ సమస్యను ఎదుర్కొననివారు ఉండరు. కానీ సమస్య తగ్గకుండా ఎక్కువవుతుంటే, ఇది లాక్టోస్ టాలరెన్స్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఒక రకమైన పేగు సంబంధిత తీవ్రమైన సమస్యలకు సంకేతం. తరచుగా మాత్రల మీద ఆధారపడడం కన్నా, వీలైనంత వరకు సహజసిద్ధమైన పరిష్కార మార్గాలను ఆశ్రయించడం మంచిదే. ఇవన్నీ చేసిన తర్వాతా సమస్య అదుపులోకి రాని పక్షంలో కచ్ఛితంగా వైద్యుడ్ని సంప్రదించాల్సిందే.
గ్యాస్ సమస్య వదలడం లేదా?
Related tags :