* ఉద్యోగులతో వీలైనంత ఎక్కువ సమయం పనితీసుకుని లాభాలు దండుకోవచ్చనే ఆలోచన ఏమాత్రం పసలేనిదని మరోసారి తేటతెల్లమైంది.జపాన్‌లో మైక్రోసాఫ్ట్ వారానికి 4రోజుల పనిదినాలతో 40శాతం గణనీయమైన వృద్ధి సాధించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
*బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా 26 ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్ల కాలంలో 3400 బ్రాంచిలు మూసివేయడం లేదా ఇతర బ్రాంచిల్లో విలీనం చేయడం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ తెలిపింది.
*అప్పుల్లో కూరుకుపోయిన హనుంగ్ టాయ్స్ ప్రమోటర్ అశోక్ కుమార్ బన్సాల్, ఆయన భార్య అంజు బన్సాల్లను ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
*జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ.. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న పెట్రోల్ కార్లనే ముందు మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటోంది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీతో కూడిన వాహనాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది.
* ప్రపంచ వృద్ధిలో దక్షిణాసియా కేంద్రంగా మారే దిశగా అడుగులు వేస్తోందని, ఇందుకు భారత్ సారథ్యం వహిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది.
*తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ (సౌదీ అరామ్కో) ఆదివారంనాడు ప్రకటించింది.
*చైనాలోని షాంఘైలో మంగళవారం నుంచి జరగనున్న అంతర్జాతీయ ఇంపోర్ట్ ఎక్స్పో (సీఐఐఈ)లో గౌరవ అతిథి దేశాల్లో ఒకటిగా భారత్ పాల్గొననుంది.
*నిఫ్టీ గత వారంలో పాజిటివ్ ధోరణిలో ప్రారంభమై 11950 వరకు వెళ్లి మైనర్ రియాక్షన్ సాధించింది. కాని చివరి మూడు రోజుల్లో ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్త ట్రెండ్ సాధించింది.
మైక్రోసాఫ్ట్‌లో వారానికి మూడు రోజుల సెలవు-వాణిజ్యం-11/04
Related tags :