DailyDose

బీజేపీలోకి మోత్కుపల్లి-రాజకీయ-11/04

Motkupalli Joins BJP-Telugu Political News Today-11/04

*తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్..దళిత నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరనున్నారు. ఆయన కాషాయం కండువా కప్పుకోవటానికి ముహూర్తం ఖరారైంది. బీజీపీ నేతల సంప్రదింపుల తరువాత సోమవారం ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నారు. కొద్ది కాలంగా మోత్కుపల్లి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది.అయితే, తనకు లభించే ప్రాధాన్యత పైనే మొత్కుపల్లి ఆ పార్టీ నేతలతో మంత నాలు సాగించినట్లు సమాచారం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ మోత్కుపల్లి ఇంటికి వెళ్లి.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. ఆ సమయంలో వారి నుండి వచ్చిన హామీ మేరకు బీజేపీలో చేరాలని మోత్కుపల్లి నిర్ణయించారు. మోత్కుపల్లి చేరిక పార్టీకి లాభం చేస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
* నువ్వేమన్న సామంతరాజువా?: దాసోజు శ్రవణ్
ప్రజాస్వామ్యంలో కేవలం నోటి మాటలతోనే సర్కారును నడిపించలేమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గమనించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్అన్నారు. ‘‘ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్డిస్మిస్ అని సీఎం బాధ్యత లేకుండా ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు విధుల్లో చేరాలని అడుగుతున్నారు. అప్పుడు సెల్ఫ్డిస్మిస్అయితే ఆ ఆర్డర్కాపీ ఎక్కడుంది? నవంబర్5లోగా చేరితే తిరిగి అదే ఉద్యోగాల్లో చేర్చుకుంటామనే ఆదేశాలు ఎక్కడ ఉన్నాయి? సింహాసనం నుంచి మౌఖిక ఆదేశాలు ఇవ్వడానికి ఆయనఏమీ సామంతరాజు కాడు” అని మండిపడ్డారు. కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లను కూడా ప్రైవేటీకరిస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
*మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్…
పవన్ విశాఖ లో ఉన్న యువతకు ఫ్రీ షో చూపించారు.పవన్ లాగా అన్నను అడ్డుపెట్టుకొని నేను పైకి రాలేదు.కాపు యువతను రెచ్చగొట్టే విధంగా పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారు.పవన్ మొదట తన పార్టీ ని సరిద్ధిధుకోవలి.చంద్ర బాబు నాయుడు కు వ్యక్తులను వాడుకోవడం బాగా తెలుసు ఇప్పుడు పవన్ మీరు దొరికారు.సినిమా హీరో లా పవన్ తాట తీస్తాం అనడం సరికాదు.గత ఎన్నికలలో పవన్ టిడిపి తో చీకటి ఒప్పందం వలెనే ఓడిపోయారు అని చిన్న పిల్లవాడికి తెలుసు.అచ్చం నాయుడు నీ ప్రక్కన పెట్టుకొని ఇసుక గురించి మాట్లాడడం పవన్ అజ్ఞానానికి నిదర్శనం.పవన్ కేసు లు గురుంచి మాట్లాడుతున్నారు దేశం లో చాలామంది రాజకీయ నాయకులు పై కేసుకు ఉన్నాయి.చంద్ర బాబు ,కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసుకు పెట్టారు.
కాపు సమాజక వర్గం లో పవన్ తప్ప మరెవరూ నాయకులు ఉండకూడదా.కాపులు పవన్ వ్యవహార శైలిని గమనించాలి.వెన్ను పోటు రాజకీయాలు ద్వారా చంద్ర బాబు పైకి వచ్చారు.పవన్ రాజకీయ సిద్ధాంతం ఎంటో ప్రజలకు చెప్పాలి.
*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ …
ప్రభుత్వం అధికారంలొకి వచ్చాక బిజెపి నేతలపై దాడులు పెరిగాయి ఐదు మాసాల్లోనే వైసిపి పాలనతో ప్రజలు బయాందోలనకు గురి అవుతున్నారు వరద వల్ల ఇసుక తీయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పడం అసమర్ధతకు నిదర్శనం గ్లెడ్జింగ్ ద్వారా ఇసుక తీయొచ్చని తెలియదా‌వైసిపి దలకు దిగి భయపెడితే ఇక్కడ భయపడడానికి ఎవ్వరూ లెరు మి సంస్ధలో పనిచెసేవాళ్ళకి, ఉద్యోగులకు ఎలా జితాలిచ్చారో భవన నిర్మాణ‌ కార్మికులకు జూన్ నెల నుంచి 10 వేలు ఇవ్వాలిచనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ వైసిపి తరుపున మాట్లాడే నేతలంతా మీ నాయకుడికి చెతనైతే ఇసుక ఇప్పించండి..అంతేకాని ప్రజా‌సమస్యలపై పోరాడే వారిని విమర్శించి పక్కదారి పట్టించకండి 2019 ఎన్నికలే నిదర్శనం…మీరు అప్రజాస్వామికంగా పాలిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు జాగ్రత్తనాలుగు నెలల్లో ప్రభుత్వానికి పోలీసులతో అవసరమేంటి క్షేత్రస్ధాయిలో నాలుగు నెలల్లో అవినితి జరుగుతుంటే జగన్ కు తెలియడం లేదాఅధికార యంత్రంగం మీద జగన్ కు పట్టుపోయింది ప్రజా సమస్యలపై బిజెపి పోరాడుతూనే ఉంటుంది.r
*ఇసుక సత్యగ్రహంలో బిజెపి సీనియర్ మహిళా నేత దగ్గుబాటి పురంధరేశ్వరి కామెంట్స్…
అధికారంలొకి వచ్చిన అరు నెలల్లోనే ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం వైసిపి నే 8 నెలల సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించాం…కాని అధికారంలోకి వచ్చిన మొదట నుంచే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో బిజెపి పొరాటాలకు దిగింది 50 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారు కార్మికుల కష్టాలు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదుమంత్రులు .. భవన నిర్మాణ కార్మికులను అవహేళన చేసినట్లుగా మాట్లాడుతున్నారు నదుల్లో వరద గడిచిన రెండు నెలల పాటే ఉంది అరు నెలలుగా లేదుఅసలు ముందుగా ఇసుక ను తెచ్చి స్టాక్ ఎందుకు స్టోర్ చేయలేదు
ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే… రాష్ట్రంలో అవగాహన లేమితో ముమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు వచ్చే అవకాశం లేదుబిజెపి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది .. భవన నిర్మాణ కార్మికులకు అండగా మేముంటాంr
*అప్పటిలోగా రాకుంటే పార్టీలతో గవర్నర్ చర్చలు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 7వ తేదీలోపు ఏ పార్టీ ముందుకు రాకుంటే రాజకీయ పార్టీలతో గవర్నర్ నేరుగా చర్చలు జరపనున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే తెలిపారు. ఈ మేరకు గవర్నర్ భగత్సింగ్ కొషియారి తనతో పాటు పలువురు పార్టీ ప్రతినిధులతో శనివారం సాయంత్రం మాట్లాడారని తెలిపారు. ఈ నెల 9తో 13వ అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నవంబర్ 7 వరకు గవర్నర్ వేచి చూస్తారని, ఒకవేళ ఎవరూ ముందుకు రాని పక్షంలో గవర్నరే స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన పార్టీలతో చర్చలు జరుపుతారని అథవాలే తెలిపారు.
*చర్చలు జరిగితే.. సీఎం పదవిపైనే :శివసేన
ప్రభుత్వ ఏర్పాటుపై మిత్ర పక్షం భాజపాతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన అదివారం స్పష్టం చేసింది. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. చెరి సగం కాలం సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన డిమాండ్కు భాజపా అంగీకరించని సంగతి తెలిసిందే. సీఎంగా తానే ఐదేళ్లపాటూ కొనసాగుతానని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తేల్చి చెప్పారు.
మహారాష్ట్రలో భాజపా ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే అది పార్టీకి పెద్ద పరాజయం అయినట్లవుతుందని శివసేన పత్రిక సామనాలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తన వీక్లీ కాలమ్లో వివరించారు
*కేసీఆర్ హామీలనే కార్మికులు అడుగుతున్నారు:భట్టి
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లుందని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో భట్టి మాట్లాడారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి కాబట్టే ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని.. అతిపెద్ద కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని దివాళా తీయించి ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని భట్టి ధ్వజమెత్తారు. కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమన్నారు.
*మాటల చిక్కుల్లో యడియూరప్ప
కన్నడనాట రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను రెండు నెలల పాటు ముంబయిలో తలదాచుకునేలా చేసింది మన పార్టీ (భాజపా) అధ్యక్షుడు అమిత్ షానే అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉప ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం హుబ్బళ్లిలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా..‘‘వారి రాజీనామాల ఫలితంగానే మనం అధికారంలో ఉన్నాం. భార్యా, బిడ్డల్ని వదలి రెండునెలలపాటు ముంబయిలో ఉండాల్సిన అవసరం వారికేమొచ్చింది? వారికి ముంబయిలో తగిన భద్రత కల్పించింది మన అధ్యక్షులే అన్న విషయం మీరు మరిచారా?’’ అంటూ కొందరు నాయకులతో వ్యాఖ్యానించారు.
*కేసీఆర్ సుముఖంగా లేరు.. ప్రయత్నిస్తా:పవన్
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావు, ఇతరులెవరూ సుముఖంగా ఉన్నట్టు కన్పించడంలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం తనను ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారనీ.. సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు పీటముడిలా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తంచేశారని పవన్ తెలిపారు. గత 28 రోజులుగా సమ్మెలో ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదని బాధ పడ్డారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని తనను కోరారని ఈ సందర్భంగా పవన్ వివరించారు.
*ఆ విషయంలో మోదీ స్పష్టత ఇవ్వాలి: సిబల్
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను కేవలం మాటలతో భారత ప్రభుత్వ అధీనంలోకి తీసుకోలేమని.. ఇందుకు ప్రధాని మోదీ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడిన సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్పై పట్టు సాధించి అధీనంలోకి తీసుకుంటాం అని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబుతున్నారు. కేవలం వారి మాటలతో ఏమీ జరగదు. భారత్లో పీవోకే కలవాలని అందరికీ ఉంది. కానీ, ఎప్పుడు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ప్రధాని మోదీ ఇదంతా ఎలా చేయనున్నారు?ఎప్పుడు చేయనున్నారు?ఈ విషయంలో మోదీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని సిబల్ పేర్కొన్నారు.
*అంబటి రాంబాబు ప్రెస్ మీట్
నదులు పొంగిప్రవహిస్తున్నాయని పదే పదే చెప్పాం.అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం అని తెలియచేశాం.వరదలు తగ్గాక ఇసుకతీయడం సాధ్యం కాదని చెప్పాం.-మూర్ఘుల మనస్సులను రంజింపచేయలేం.-విశాఖలో పవన్ కల్యాణ్ లా…0గ్ మార్చ్ చేశారు.-అందులో భవననిర్మాణకార్మికులు కనిపించలేదు.అందులో జనసేన జెండాలుపట్టుకున్న టిడిపి కార్యకర్తలు కనిపించారు.ఆ రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారు.అది టివిలలో చూశాం.-పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు మీరు నడుపుకుంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు.-డిఎన్ ఏ అంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు.డిఎన్ ఏ అంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల వ్యక్తిగతమైనది కాదు.