సోషల్ మీడియాలో తనను విమర్శించే వ్యక్తులపై తాప్సీ విరుచుకు పడుతుంటారు! విమర్శకులకు వ్యంగ్యంగా ఆమె ఇచ్చే సమాధానాలు అందర్నీ నవ్విస్తాయి. తాజాగా ట్విట్టర్‌లో అటువంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. ‘‘హిందీ చిత్రసీమ చరిత్రలో అత్యంత సమస్యాత్మక నటి తాప్సీ. ఆమెకు ఈ సంగతి తెలుసో? లేదో?’’ అని రాజీవ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. అందుకు బదులుగా తాప్సీ ‘‘నాకు తెలుసు. నా తల్లితండ్రులు కూడా నాతో సమస్యే అని నమ్ముతారు. మూసధోరణిలో జీవించే వ్యక్తులకు నాతో పెద్ద సమస్యే. నీకు ఇలా చెబుతున్నందుకు బాధగా ఉంది… నేనిలానే ఉంటాను. అందువల్ల, నీకు ఇంకొంచెం సహనం, శక్తి ఉండాలి’’ అని ట్వీట్ చేశారు. ‘‘తప్పడ్’ సినిమా విడుదలైతే వాళ్లకు ఏమవుతుందో?’’ అని సోనీ పిక్చర్స్‌కు చెందిన లడ గురుదెన్ సింగ్ ట్వీట్ చేయగా… ‘‘ఉఫ్! ఆ తర్వాత నేను చాలామందికి సమస్యగా మారతాను. అప్పటి వరకూ వాళ్లను బతకనివ్వు’’ అని తాప్సీ బదులిచ్చారు.
నాతో చాలా సమస్యలు
Related tags :