Politics

ఎల్వీ-ప్రవీణ్‌ల మధ్య తారాస్థాయిలో విభేదాలు

The sad IAS cold war situation between praveen prakash and lv subramanyam in jagan's administration

ఏపీ అధికార వ్యవస్థలో ఏమి జరుగుతోంది. ఓ వైపు సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సి ఎం జీ ఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య విభేదాలు. తాజాగా మరో కీలక అధికారి ఏకంగా ప్రవీణ్ ప్రకాష్ పై ఫిర్యాదు చేస్తూ సి ఎస్ కు లేఖ రాయడం కలకలం రేపుతుంది. అత్యంత కీలకమైన ఏపీ కేబినేట్ విభాగంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న గురుమూర్తి సీఎస్ కు చేసిన వినతి ఆశ్చర్యంగా ఉంది. ప్రవీష్ ప్రకాష్ దగ్గర తానూ పని చేయనని తనను వేరే శాఖకు మార్చాలని ఆయన సి ఎస్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. దీంతో పాటు పలు అంశాలను గురుమూర్తి తన లేఖలో పేర్కొనడం అధికార వర్గాల్లో కలకలం రేపుతుంది. ప్రవీష్ ప్రకాష్ సరైన పనిని వాయిదా వేస్తూ జాప్యం చేసే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు. అంతే కాదు ఆయన తప్పులను ఇతరుల మీద తోసి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన తప్పేమీ లేకపోయినా ఇతరుల ముందు ఎన్నోసార్లు తనను అవమానిస్తున్నారని తానూ కూడా ఆయన లాగే 1993లో సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసానని సి ఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పాతిక సంవత్సరాల సర్వీసు పూర్తీ చేసుకుని ఈ వయస్సులో ఆయన దగ్గర తిట్లు తినటం భరించలేనని విధంగా ఉందన్నారు. ఈ విషయాలు అన్ని గమనంలోకి తీసుకుని తనను అక్కడ నుంచి ఇతర శాఖకు మార్చాలని తన లేఖలో సి ఎస్ కు కోరారు. ప్రభుత్వాదికారులందరికీ హెడ్ అయిన సిఎస్ కు మరోవైపు సిఎంవోలోని ఉన్నతాధికారుల మధ్య విభేదాలు కోల్డ్ వార్ స్థాయికి చేరాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎంతో సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అధికారుల మధ్య నెలకొన్న వివాదాల ఎటువైపు వేలతాయో అన్న టెన్షన్ తో ఇతర అధికారులు ఉన్నారు. మధ్యలో గురుమూర్తి లేఖ వ్యవహరం వేలుగుచూడటం మరింత దుమారం రేపుతుంది.

**ఎల్వీ, ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య గొడవకు ఇవే కారణాలు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సిఎంకార్యాలయంలోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య వివాదానికి కారణం ఏమీ అయి ఉంటుంది? సి ఎస్ ఏకంగా ఎందుకు ప్రవీణ్ కు మేమో జారీ చేసి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అందులో స్పష్టంగా ప్రవీణ్ ప్రకాష్ బిజినెస్ రూల్స్ తో పాటు కండక్ట్ రూల్స్ ను కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎల్వీ, ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య వివాదానికి కారణమైన అమ్శాలేంతో ఓ లుక్కేద్దాం.. వైఎసార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్స్ కు సంబందించిన ఫైలును మంత్రివర్గం ముందుకు పెట్టేందుకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సిఎస్ ఎల్వీ సుబ్రమన్యానికి పంపారు. అయితే సిఎస్ ఈ ఫైలును వెనక్కి పంపి బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్ధిక శాఖ అనుమతి తీసుకోవటంతో ఈ వ్యవహారంతో సంబందం ఉన్న అందరి నుంచి అభిప్రాయలు తీసుకోవాలని కోరారు. ఏపీ బిజినెస్ రూల్స్ లోని నిబంధన ప్రకారం రీ సర్కులేట్ చేయాలని సూచించారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రవీణ్ ప్రకాష్ చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా ఈ ప్రతిపాదనను కేబినేట్ ముందు పెట్టారు. మరోకేసు గ్రామ న్యాయలయాలక్యు సంబందించింది. గ్రామ న్యాయాలయాలకు సంబందించిన ఫైలును సంబందిత శాఖ మంత్రివర్గంలో ప్రతిపాదన పెట్టేందుకు వీలుగా ముఖ్యమంత్రి వరకూ అనుమతులు పొందింది. అయితే ఆశాఖ కార్యదర్శి కోరినా కూడా ప్రతిపాదిత ఫైలును కేబినేట్ ముందు పెట్టడంలో జీ ఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ విఫలమయ్యారు. ముఖ్యమంత్రి అనుమతి తరువాత కూడా ఎ కారణంతో అయిన సరే ముఖ్యకార్యదర్శి , జీ ఏడీ ముఖ్య కార్యదర్శి తన దగ్గర పైలు పెట్టుకునే అధికారం లేదనే ప్రవీణ్ ప్రకాష్ కు ఇచ్చిన మేమోలో ఎల్వీ పేర్కొన్నారు. ఒక వేళ సిఎంవో నుంచి మౌఖిక ఆదేశాలు అందినా కూడా ప్రవెన్ ఆ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెక్రటరి అయిన చీఫ్ సెక్రటరి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ ఈ పద్దతిని పాటించలే దన్నారు. మంత్రివర్గం ముందు ప్రతిపాదనలకు సంబందించిన ఫైల్స్ నిర్వహణలో ప్రవీణ్ ప్రకాష్ నిబంధనలను దారుణంగా ఉల్లంఘించారని తెలిపారు. అంటే కాకుండా ఈ విషయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ దుష్ప్రవర్తనతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నితిని పరిశీలిస్తే సదరు అధికారు ఉద్దేశపూర్వకంగా బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించడం తో పాటు తనపై అధికారులను అగౌరవపరచేలా వ్యవహరించారన్నారు. దీని ద్వారా సీనియర్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ రూల్స్ 1968 ఉల్లంఘించారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తన మేమోలో పేర్కొన్నారు. ఈ అంశాలనితిని పరిగణనలోకి తీసుకుని బిజినెస్ రూల్స్, కండక్ట్ రూల్స్ ఉల్లంఘించినందుకు వరం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.