జర్మనీ దేశంలోని సమైక్య తెలుగు వేదిక ఆధ్వర్యంలో శనివారం నాడు 2019 దీపావళి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. 350మంది తెలుగువారు ఈ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గానకచేరీ, నాట్యం, మహిళలు, జంటలకు పలు పోటీల్లో సంస్థ సభ్యులు, అతిథులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ సమైక్య తెలుగు వేదిక సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. PJ Telesoft, Indianstores Stuttgart, Matrix Structures, Bobby travels, Asiatische travels, Gayathri Caterers, Kohinoor restaurant తదితరులకు సంస్థ ధన్యవాదాలు తెలిపింది. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే పలు కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వహిస్తామని కార్యవర్గం ఓ ప్రకటనలో తెలిపింది.
జర్మనీలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
Related tags :