Business

ప్రైవేట్ డ్రైవర్లు. RTC కండక్టర్లు.

TSRTC Running Buses With Private Drivers And Govt Conductors

ఉమ్మడి మెదక్ జిల్లాకు మరో 152 కొత్త అద్దె బస్సులు వచ్చినయ్ . 9 రూట్లలో ఈ బస్సులు ఈ నెల 4 వ తేదీ నుంచి రోడ్లపైకి రానున్నయి. మెదక్ రీజియన్ పరిధిలోని సంగారెడ్డి , మెదక్ , సిద్దిపేట జిల్లాల ఆర్టీసీడిపోల పరిధిలో కొత్త అద్దె బస్సులు నడిపేందుకుయాజమాన్యం నిర్ణయించింది. రీజియన్ లో ఇప్పటికేఐదు రూట్లలో 180 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఆఫీసర్లు ప్రైవేట్ ఆపరేటర్లకు కాంట్రాక్టు ఇచ్చారు .సంగారెడ్డి నుంచి మెదక్, గజ్వేల్, నర్సాపూర్, పటాన్ చెరు , నారాయణఖేడ్ రూట్లలో ఆ బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో 152 ప్రైవేట్ బస్సులను అదనంగా నడిపించేం దుకు అక్టోబరు నెలలో రెండు విడతలుగా కాంట్రాకర్ట ్లనుంచి టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వచ్చిన ఈ 152 అద్దె బస్సులలో కొన్నిం టిని సంగారెడ్డి నుంచి హైదరాబాద్, యాదగిరి గుట్ట, తాండూర్, సిద్దిపేట, వరంగల్, బీదర్, జోగిపేట, గజ్వేల్, నారాయణఖేడ్ రూట్లలో నడిపేందుకు నిర్ణయించారు. మిగతా ప్రైవేట్ బస్సులను మెదక్, సిద్దిపేట జిల్లాలో ని హెడ్ క్వా ర్టర్ల నుంచి నడపనున్నరు . మొదటి విడతలో 39 బస్సులకు టెండర్లు పిలవగా 691 మంది దరఖాస్తు చేశారు. రెండో విడతలో 113 బస్సులకు 1,252 మంది టెండర్లు వేసేందుకు ముందుకొచ్చారు. రూట్ల వారీగా ఆర్టీసీకి చెల్లిం చాల్సి న మొత్తాన్ని ఆఫీసర్లు ఇదివరకే నిర్ణయించగా వాటికి అనుగుణంగానే అద్దె బస్సులకు టెండర్లు వేశారు. టెండర్లను దాఖలు చేసిన వారి పేర్లను ఆఫీసర్లు డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు.
** కొత్తగా కాంట్రాక్టు పొందిన బస్సులకు డ్రైవర్ గా ప్రైవేట్ వ్యక్తి కొనసాగుతారు. కండక్టర్ గా ఆర్టీసీకి చెందిన వారుంటారు . డ్రైవర్ ను అద్దె బస్సు ఓనరు నియమించాల్సి ఉంటుంది. కండక్టర్ ను ఆర్టీసీ నియమిస్తుంది. బస్సులో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీలను కండక్టర్ రెగ్యు లర్ గా ఆర్టీసీకి చెల్లిస్తాడు.అద్దె బస్సులకు ఒప్పందం ప్రకారం ఆర్టీసీ డబ్బులు
చెల్లిస్తుం ది. ఉమ్మడి జిల్లా ఆర్టీసీ రీజియన్ పరిధిలో8 డిపోలు ఉన్నాయి. సంగారెడ్డి , జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞా పూర్,దుబ్బా కలో డిపోలను ఏర్పా టు చేయగా రోజుకు 650 బస్సులు నడవాల్సి ఉన్నది. కానీ సమ్మె ప్రభావంతో ఆర్టీసీ, అద్దె బస్సులు కలుపుకుని రోజుకు 560 నడుస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
* మెదక్ రీజియన్ పరిధిలో రూట్లవారీగా కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు అద్దె బస్సులను నడపాల్సి ఉంది. ప్రస్తుతానికి 152 బస్సులలో 10 కొత్త బస్సులు సోమవారం నుంచి నడవనున్నయి . ప్రస్తుతానికి 10 మినీ బస్సులను సంగారెడ్ డి, మెదక్ , సిద్దిపేట జిల్లాలకు పంపిణీ చేశారు. త్వరలో మిగతా బస్సులు దశలవారీగా నడిపించనున్నారు. టెండర్ల నిబంధనల ప్రకారం 90 రోజుల్లోగా ఆపరేటర్లు పూర్తి స్థాయిలో బస్సులను నడపాలి. లేదంటే ఆపరేటర్ల లైసెన్స్ లను రద్దు చేసి ఆర్టీసీలో మరోసారి టెం డర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తారు .