DailyDose

ఫేస్‌బుక్ లోగో మారింది-వాణిజ్యం-11/05

Facebook redesigns logo-Telugu business news roundup today-11/05

* ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ తన లోగోను మార్చింది. ఇంగ్లిష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉన్న అప్పర్ కేస్ లెటర్స్‌తో FACEBOOK అనే లోగోను నూతనంగా క్రియేట్ చేసింది. అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వాడుతామని, మిగిలిన వాటి కోసం ఫేస్‌బుక్ పాత లోగో అలాగే ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. అయితే ఫేస్‌బుక్ కొత్త లోగో పట్ల నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆ మాత్రం లోగో క్రియేట్ చేసేందుకు మిలియన్ డాలర్లు వెచ్చించాలా..? అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
*పండగల సీజన్లో డిమాండును పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పెద్ద ఉత్సాహాన్ని నింపలేకపోయాయి.
*ప్రీమియం చెల్లించని కార ణంగా రద్దయిన (లాప్స్) పాలసీల ను మళ్లీ పునరుద్ధరించుకునే అవకా శాన్ని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కల్పిస్తోంది.
*వ్యవసాయ రంగంలోని కంపెనీలు, చిన్న పరిశ్రమలు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడానికి హైదరాబాద్, జినోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్కు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది
*లిక్విడిటీకి సంబంధించిన సంక్షోభం ఏదైనా రాబోతున్నదా అన్నది ముందుగానే సూచించగల మెరుగైన రిస్క్ పర్యవేక్షణ సూచీలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్బీఎ్ఫసీలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు ఆర్బీఐ ‘లిక్విడిటీ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ మార్గదర్శకాలు జారీ చేసింది.
*భారత్లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య ప్రపంచంలోనే రెండో అత్యధికం కావచ్చు. కానీ మొబైల్ డేటా వేగంలో మాత్రం నేపాల్, పాకిస్థాన్ వంటి చిన్నదేశాల కంటే వెనుకబడి ఉంది డేటా స్పీడ్ సంస్థ ఊక్లా ఈ విషయాలను ప్రకటించింది.
*జూలై-సెప్టెంబరు కాలానికి హైదరాబాద్లో గృహ విక్రయాలు 16 శాతం తగ్గి 4,257 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో 5,067 గృహాలు అమ్ముడయ్యాయని ప్రాప్ఈక్విటీ తాజా నివేదిక వెల్లడించింది.
*భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. రూ.599 ప్లాన్ కింద రీచార్జ్ చేసుకుంటే సంబంధిత కస్టమర్కు జీవిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది.
*సెప్టెంబరుతో ముగిసిన త్రెమాసికంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) భారీగా నష్టాలను మూటగట్టుకుంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకు రూ.2,253.64 కోట్ల నష్టాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నష్టాలు రూ.487.26 కోట్లుగా ఉన్నాయి.
*హెచ్డీఎ్ఫసీ.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.10,748 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.3,962 కోట్లు)తో పోల్చితే నికర లాభం ఏకంగా 76 శాతం వృద్ధి చెందింది.