* ప్రస్తుత దేశ రాజధాని న్యుదిల్లిలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడం భారతరత్నా అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ నగరం రెండో రాజధాని అయ్యే అవకాశాలు తోసిపుచ్చలేమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ భాజపా సీనియర్ నేత విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు యునివర్సిటిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా సాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. యువ కళావాహిని సరపల్లి కొండలరావు పౌండేషన్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా. శ్రీధర్ రెడ్డి రచించిన కవితా సంపుటి శ్రీధర్ కవితా ప్రస్థానం ను విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. డిల్లీలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తుంటే హైదరాబాద్ నగరం బహుశా రెండో రాజధాని కావచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు కవులు పాల్గొన్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
* తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల తమ జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
* ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
* జాతీయ జూనియర్ అద్లేతిక్స్ చాంపియన్ షిప్ లో తెలంగాణా అద్లేట్లు జోరు ప్రదర్శిస్తున్నారు. సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అండర్- 18 యూత్ బాలికల వంద మీటర్ల హర్సిల్స్ పరుగులో నందిని రజతం సొంతం చేసుకుంది. 14.47 సెకన్ల టైమింగ్ తో ఆమె రెండోస్థానంలో నిలిచింది. అండర్- 16 బాలుర వెయ్యి మీటర్ల స్ప్రింట్ మెడ్లీరీలేలో తెలంగాణా జట్టు కాంస్యం గెలుచుకుంది. తరుణ్, ప్రణవ్, కార్తీక్ మహేశ లతో కూడిన జట్టు 2.00 56 నిమిషాల్లో రేసు ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది.
*ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్‌ను తొలగించే అధికారం సీఎంకి ఉన్నప్పటికీ.. తొలగించిన విధానం సరిగ్గా లేదన్నారు. బాధ్యత లేకుండా అధికారం చలాయిస్తున్న సీఎంవో సీఎంల మెడకు ఉచ్చులా చుట్టుకుంటోందని చెప్పారు
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధించిన గడువు సమీపిస్తోంది. కౌంట్ డౌన్ మొదలైంది. ఈ అర్ధ్రరాత్రి వరకే వారికి ఉన్న సమయం. కొన్ని చోట్ల స్వల్ప సంఖ్యలో కార్మికులు తిరిగి విధులో చేరుతున్నా రు. కార్మిక సంఘాలు మాత్రం ఈ డెడ్ లైన్లను పట్టించుకోమంటున్నారు.
*తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల తమ జాయినింగ్ లెటర్స్ ఇవ్వవచ్చని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
*ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
*ముంచుకువస్తున్న మహా తుపాన్ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం వెల్లడించింది.
*రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను తీసుకునేందుకు.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం సొంత జిల్లాకు రానున్నారు.
*రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 7వ తేదీన రాయలసీమ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ విద్యార్థి యువజన జేఏసీ నాయకులు తెలిపారు.
*దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. అక్కడి పరిస్థితులను చూస్తుంటే డా.అంబేడ్కర్ కోరుకున్నట్లుగా బహుశా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు.
*పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు సోమవారం పెట్రోల్ సీసాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట హల్చల్ చేశాడు.
*దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. అక్కడి పరిస్థితులను చూస్తుంటే డా.అంబేడ్కర్ కోరుకున్నట్లుగా బహుశా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు.
*రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్తో సోమవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తూ ఆమెకు శుభలేఖ అందజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. తన కుమారుని వివాహానికి సీఎంను ఆహ్వానించారు.
*రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ ఉపకారవేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ సమ్మె, సాంకేతిక కారణాల నేపథ్యంలో డిసెంబరు 31 వరకు వెసులుబాటునిచ్చింది.
*తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా న్యాయవాది నామవరపు రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. మహబూబాబాద్ జిల్లా సూదన్పల్లికి చెందిన ఆయన 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.పలు ప్రభుత్వ విభాగాలకు ప్యానల్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు
*హైదరాబాద్- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో సోమవారం నుంచి హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్ఓజీ) సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న రైళ్ల సంఖ్య 11కు చేరింది. ఈ విధానంతో డీజిల్ వినియోగం ఉండదని, వాయు, శబ్ద కాలుష్యాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని ద.మ.రై జీఎం గజానన్ మాల్య తెలిపారు. గతంలో ఈ రైళ్లలో ఏడాదికి 49.7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగానికి రూ.35 కోట్లు ఖర్చు అయ్యేదన్నారు.
*రాష్ట్రంలో 7,372 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచినీటి సౌకర్యం లేదు. ఈ మేరకు ఆయా ప్రధానోపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖకు నివేదికలు సమర్పించారు. రాష్ట్రంలో విద్యాశాఖ సహా, సంక్షేమ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 29,918 ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల స్థితిగతులను అప్లోడ్ చేయటానికి పాఠశాల విద్యాశాఖ మొబైల్ యాప్ రూపొందించింది.
*జాతీయ రహదారులపై వాహనదారులు డిసెంబర్ 1 నుంచి తమ వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ ఏర్పాటు చేసుకోవటం తప్పనిసరి అని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సుఖ్భీర్ సింగ్ సంధూ స్పష్టం చేశారు.
*మిడ్మానేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతాల భూసేకరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతలటానా గ్రామంలో ప్రభుత్వానికి చెందిన పురాతన బురుజుకు ఓ ప్రైవేటు వ్యక్తి పొందిన రూ.55 లక్షల పరిహారాన్ని రాబట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
హైదరాబాద్ దేశానికే రెండో రాజధాని కావచ్చు-తాజావార్తలు-11/05
Related tags :