1. 8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనగుడి – ఆద్యాత్మిక వార్తలు- 05/11
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో 21వ విడత మనగుడి కార్యక్రమం జరగనుంది. రెండు రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున శివాలయాన్ని ఎంపిక చేసి 5 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. అలాగే ఒక్కో జిల్లాలో 5 చొప్పున శివాలయాల్లో కానీ తితిదే కల్యాణమండపాల్లో కానీ 11వ తేదీన కార్తీక దీపోత్సవాన్ని చేపట్టనున్నారు.
2.జగన్నాథుని ఆస్తి వివరాలు సమర్పించాలి: సుప్రీంకోర్టు
పూరీ శ్రీక్షేత్రంలో సంస్కరణలు, జగన్నాథుడు, భక్తుల సేవలకు సంబంధించి విచారించిన సుప్రీంకోర్టు సోమవారం 22 అంశాలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. జస్టిస్ అరుణ్మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీక్షేత్ర పాలకవర్గానికి పలు సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జగన్నాథుని ఆస్తుల వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది
3. మీ రాశిఫలాలు
మేషం
మేష రాశి : ఈ రోజు స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయం అవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది.
షభం
వృషభం : ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పై అధికారులను కలువడానికి, ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, పశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం పొందుతారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.
మిథునం
మిథునం : ఈ రోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
కర్కాటకం
కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.
సింహం
సింహం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను,అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ ప్రేమ ను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయం, విద్యా విషయంలో కొంత ఆందోళన చెందుతారు.
కన్య
కన్య : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూ సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.
తుల
తుల : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
వృశ్చికం
వృశ్చికం : ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలువు అయినప్పటికీ బయటకెళ్లడంకంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది.
ధనుస్సు
ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయటం,మిత్రులను కలువడం చేస్తారు.అలాగే వాహన కొనుగోలు,రిపేర్ చేయించటం కానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం
మకరం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చు ఉండడంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.
కుంభం
కుంభం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.
మీనం
మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయడానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. మీ మిత్రులతో,దగ్గరి బంధువులతో కానీ వివాదం జరుగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరుగొచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
4. పంచాంగం 05.11.2019
సంవరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: శుక్ల
తిథి: నవమి పూర్తి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: ధనిష్ట పూర్తి
యోగం: దండ, వృధ్ధి
కరణం: బాలవ
వర్జ్యం: ఉ.10:00 – 11:45
దుర్ముహూర్తం: 08:33 – 09:19
రాహు కాలం: 02:51 – 04:17
గుళిక కాలం: 11:59 – 01:25
యమ గండం: 09:07 – 10:33
అభిజిత్: 11:37 – 12:21
సూర్యోదయం: 06:15
సూర్యాస్తమయం: 05:43
వైదికసూర్యోదయం: 06:19
వైదిక సూర్యాస్తమయం: 05:39
చంద్రోదయం: ప.01:25
చంద్రాస్తమయం: రా.12:13
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మకరం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: దక్షిణం
కూష్మాండ-అక్షయ నవమి
మధురాపురి ప్రదక్షిణ
కూష్మాండ దానం
కృతయుగాది
పుష్కరనది స్నానారంభం
విష్ణుత్రిరాత్ర వ్రతం
లౌహిత్యనది స్నానం
5. చరిత్రలో ఈ రోజు నవంబర్, 05
సంఘటనలు
1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.
1605: బ్రిటిష్ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే ‘గన్‌పౌడర్ ప్లాట్’ అంటారు. ‘గై ఫాకెస్’ అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి ‘గై ఫాకెస్ డే’గా జరుపుకుంటారు.
1895: జార్జ్ సెల్డెన్ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్ ఆటోవెుబైల్ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు.
1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.
1967: ఏటీఎస్-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది.
1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.
1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించాడు.
1976: భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్పదవిని స్వీకరించాడు.
1989: అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్‌్ మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.
జననాలు
1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)
1892: జె.బి.ఎస్. హాల్డేన్, ప్రఖ్యాత బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964)
1925: ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978)
1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.
మరణాలు
1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)
1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)
1995: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.
8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో మనగుడి
Related tags :