టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ కథానాయకుడు రానాతో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనేక సందర్భాల్లో ఆమె, రానా కలిసి వివిధ వేడుకల్లో కనిపించారు. దీంతో ఈ వదంతులు మొదలయ్యాయి. ఈ వార్తలపై రకుల్ తాజాగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. తను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని స్పష్టం చేశారు. ‘నా ఇల్లు, రానా ఇల్లు పక్కపక్కనే. మంచు లక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. అలాగే రానా కూడా క్లోజ్ ఫ్రెండ్. లక్ష్మి, నేను, రానా.. ఇలా మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో చాలా మంది ఉన్నారు. మేమంతా చాలా స్నేహంగా ఉంటాం. నా సినీ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రానా నాకు తెలుసు. అయినా నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నేను సింగిల్. ఈరోజుల్లో ప్రేమకు అర్థం మారిపోయింది. నేను 70ల కాలంలో పుట్టి ఉండాల్సిందని ఎప్పుడూ అనుకుంటుంటా’ అని రకుల్ పేర్కొన్నారు.
రానాతో ఏమి లేదు
Related tags :