DailyDose

ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్-నేరవార్తలు-11/05

Senior Assistant Captured By ACB-Telugu Crime News-11/05

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న నియర్‌ అసిస్టెంట్‌ కుమార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ఓ వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
* తూర్పుగోదావరి జిల్లా…కాకినాడ జీజీహెచ్ లో ఆత్మహత్యకి పాల్పడిన వీర బాబు భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం వీరబాబుభార్య,పిల్లలను పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కుటుంబ పరిస్థితి పై ఆరా తీసి అండగా ఉంటామని హామీ ఇచ్చిన లోకేష్ గత ఐదు నెలలుగా అనేక ఇబ్బందులు పడ్డాం,పనులు లేక అప్పులపాలయ్యాం.కుటుంబాన్ని పోషించే స్తోమత లేక బాధతో వీరబాబు ఆత్మహత్య కి పాల్పడ్డారు.
* కర్నూలు ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. భక్తుల విడిది గది 167 ,వెనక మనిషి పుర్రె, ఎముకలు, పసుపు, కుంకుమలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు విచారణ జరుపుతున్నారు.
* విమర్శలకు తావిస్తోన్న బెజవాడ ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు..కొత్త నిబంధనలంటూ బుల్లెట్ లకు పాత సైలెన్సర్స్ మార్చాల్సిందే అంటూ హుకుం..కంపెనీ వారు ఇచ్చిన సైలెన్సర్ లు పనికి రావంటూ వాహనాలను సీజ్ చేస్తోన్న ట్రాఫిక్ సిబ్బంది…
శబ్ద కాలుష్యం పేరిట వేలకు వేలు అపరాధ రుసుంతో పాటు వాహనాల సీజ్ తో వాహన చోదకులకు ఇక్కట్లు…చలానా తో పాటు కౌన్సిలింగ్ పేరిట కొత్త సైలెన్సర్ లు నిర్భందంగా మార్పిస్తున్న పోలీసులు.
* ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. కాటేకల్యాన్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.
* బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముజఫరాబాద్‌లో ప్రయాణీకులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
* అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రె పల్లి గ్రామం పొలం లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య… మృతులు కర్ణాటక వాసులుగా అనుమానం….హత్య ప్రదేశంలో టీవీఎస్ xl మోపెడ్ మొబైల్ స్వాధీనం.స్థానికుల సమాచారంతో పోలీసుల విచారణ..
* ఇరాక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రసార మాధ్యమ కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులపై భద్రతా దళాలు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి.
* కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఇస్లావత్ రాకేశ్ (07). అనే బాలుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.
* నెల్లూరుజిల్లా వెంకటగిరిలో ఎర్రచందనం పట్టివేతవెంకటగిరి రేంజ్ అధికారి ఆదేశాల మేరకు,, ఫారెస్ట్ బీట్ అధికారి షేక్.ఫరీద్…కుర్జాగుంట ఫారెస్ట్ బీట్ పరిధిలో దాడులు నిర్వహించగా అక్రమంగా తరలించేందుకు నిల్వవుంచిన,, సుమారు లక్ష రూపాయల విలువగల 14 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారుఒక నిందితుడు అరెస్ట్ చేసి రిమెండ్ తరలించారని వెంకటగిరి రేంజ్ అధికారి శ్రీదేవి మీడియాతో తెలిపారు
* కొత్తూరు తాడేపల్లిలో ఆవుల మృతి ఘటనపై పూర్తయిన సిట్ దర్యాప్తు..సీపీకి నివేదిక సమర్పించిన సిట్‌.. పశుగ్రాసంలో చేరిన టాక్సిసిటి వలనే ఆవులు చనిపోయినట్టు నిర్దారణ..ఆగస్టు 10న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన 90 కి పైగా ఆవులు..ప్రకాశం జిల్లా నుండి వచ్చిన గడ్డిలో రసాయనాల శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించిన పశుసంవర్దక శాఖ అధికారులు..
టాక్సిసిటి అధికంగా ఉన్న పశుగ్రాసం తినడం వల్లే నైట్రెట్లుగా మారి పశుల ప్రాణం తీసినట్టు పోస్టుమార్టం నివేదిక అందించిన పశుసంవర్దక శాఖ అధికారులు..కుట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గో ప్రేమికులు
* దేవాలయంలోని హుండీని పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదును దోచుకెళ్లారు. ఈ చోరీ ఘటన విజయవాడలోని రామవరప్పాడు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* నిన్న అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఆమె కారు డ్రైవర్ గురునాథ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ గురునాథ్ మృతి చెందాడు. 90శాతం కాలడంతో గురునాథ్ శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు తెలిపారు.
*అపోలో అపోలో డిఆర్డిఓ చెబుతున్న గురునాథం కొద్దిసేపటికి తో మరణించాడు. ఇందుకు సంబంధించి వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మంటల్లో కాలిపోతున్న విజయ్ ని కాపాడే ప్రయత్నంలో గురునాథం ప్రయత్నం చేశాడు .
*కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఇస్లావత్ రాకేశ్ (07). అనే బాలుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
* కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఇస్లావత్ రాకేశ్ (07). అనే బాలుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
*అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రె పల్లి గ్రామం పొలం లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య…
మృతులు కర్ణాటక వాసులుగా అనుమానం….హత్య ప్రదేశంలో టీవీఎస్ xl మోపెడ్ మొబైల్ స్వాధీనం.స్థానికుల సమాచారంతో పోలీసుల విచారణ..
*అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడిని గౌరెల్లికి చెందిన సురేశ్గా గుర్తించామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. బాచారంలోని సర్వే నంబర్ 92, 93లో 7 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకాల వ్యవహారంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు.
*హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్లో ఘోరం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
*తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్ను పోలీసులు వెలికి తీశారు. కేబిన్లో డ్రైవర్, క్లీనర్ మృతి చెందినట్లు వారు వెల్లడించారు.
*ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన వాగ్వాదం.. గుడ్లు తినే పందేనికి దారి తీసింది. చివరకు ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది. 50 గుడ్లు తింటే రూ.2 వేలంటూ ఇద్దరూ పందెం కాసుకున్నారు. దీంతో సుభాష్ యాదవ్(42) అనే వ్యక్తి గుడ్లు తినడం మొదలెట్టాడు. నలభై ఒకటో గుడ్డును పూర్తి చేసి 42వ గుడ్డు తినడం మొదలు పెట్టేసరికి ఆయన ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు.
*వ్యవసాయ క్షేత్రంలో గడ్డికోస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడి, ఆమె ఉసురుతీశాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ శివారులో సోమవారం జరిగింది.
*ఇండియన్ ఆర్మీ(ట్రూప్ ఆఫ్ అస్సాం రైఫిల్స్) 92 లక్షలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
*నిమిషాల వ్యవధిలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఉదంతమిది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మొరసకుంటకుంట తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
*శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కాకతీయ కాలువలో గల్లంతైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు వ్యక్తిగత సహాయకుడు(పీఏ) ఠాకూర్ గిరీష్సింగ్(38) మృతదేహం సోమవారం లభ్యమైంది.
*వరంగల్ కమిషనరేట్ పరిధిలో వేలేరు మండల తహసీల్దార్ రజనిని మల్లికుదురు గ్రామ సర్పంచి రాజిరెడ్డి సోమవారం ఇంటికి వచ్చి బెదిరించారు.
*సౌదీ అరేబియాకు అక్రమంగా తరలిస్తున్న గంధపు చెక్కలను అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
*మద్యానికి బానిసవడం.. పింఛను డబ్బులతో పాటు ఇంటిని ఇవ్వడానికి తల్లి నిరాకరించడంతో ఓ వ్యక్తి భార్య, కుమార్తెకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదం చిత్తూరు సంతపేటలోని హౌసింగ్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
*ఇసుక కొరతతో పనుల్లేక, కుటుంబపోషణ భారమై మనస్తాపానికి గురైన భవననిర్మాణ కార్మికుడు కొయ్యా వీరబాబు (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటుచేసుకుంది.
*కోడిపందేల స్థావరంపై దాడి చేసి అరెస్టు చేసిన నలుగురిలో ఒకరు కొద్దిసేపటికే పోలీస్స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఉద్రిక్తతకు, ఆందోళనలకు దారితీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడులో ఈ స్థావరంపై చేబ్రోలు ఎస్సై ఐ.వీర్రాజు ఆధ్వర్యంలో సోమవారం దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.