తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శనివారం నాడు బ్రాంప్టన్ నగరంలోని చింగోస్కీ సెకండరీ స్కూల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల ప్రారంభోపన్యాసంతో ఈ వేడుక మొదలైంది. వీణ దేశాయ్, రాణి మద్దెల, కామాక్షి పెరుగు జ్యోతి ప్రజ్వలన చేశారు. స్థానిక చిన్నారులు, యువత, ప్రవాసులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూచిపూడి, భరతనాట్యం , కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యా లు, మరియు నాటికలు అలరించాయి.
దీప సాయిరాం, వాణి జయంత్ లు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. తాకా అధ్యక్షులు అరుణ్ కుమార్ లయం సంస్థ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలను వివరి౦చారు. అత్యధిక జీవిత సభ్యుల గల సంస్థగా , అత్యధిక దాతలున్న సంస్థగా కెనడాలో తెలుగు స౦స్కృతి, సా౦ప్రదాయలను ము౦దుతరాల వారికి అందించడంలో తాకా బలోపేతంగా ఉందని అన్నారు. దాత వెంకట్ పెరుగుని ఘనంగా సత్కరించారు. సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేటని శాలువాతో సత్కరించారు. కోశాధికారి కల్పనా మోటూరి, ఫుడ్ కమిటీ ఇంచార్జి సురేష్ కూన, ఫౌండర్స్ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, ట్రస్టీ సభ్యులు కిరణ్ కాకర్లపూడి, ఆర్నాల్డ్ మద్దెల, బాషా షేక్, రాంబాబు కల్లూరి తదితరులను అధ్యక్షుడు అరుణ్ అభినందించి ధన్యవాదాలు తెలిపారు. తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కుందూరు, రామచంద్రరావు దుగ్గిన, రమేష్ మునుకుంట్ల, గంగాధర్ సుఖవాసి వేడుకలను పర్యవేక్షించారు. తాకా వ్యవస్థాపక సభ్యుడు చారి సామాంతపూడి నూతన కార్యవర్గాలను (2019-2021) సభకు పరిచయం చేశారు.
New Governing Board(2019-2021)
Executive Committee
అధ్యక్షులు: శ్రీ శ్రీనాథ్ రెడ్డి కుందూరి
ఉపాధ్యక్షులు: శ్రీమతి కల్పన మోటూరి
జనరల్ సెక్రటరీ: శ్రీ నాగేంద్ర హంసాల
కోశాధికారి: శ్రీ సురేష్ కూన
కల్చరల్ సెక్రటరీ: శ్రీమతి వాణి జయంత్
డైరెక్టర్: శ్రీ మల్లికార్జునచారి పదిర
డైరెక్టర్: శ్రీ ప్రవీణ్ పెనుబాక
డైరెక్టర్: శ్రీ రాజా రామ్ మోహాన్ రాయ్
యూత్ డైరెక్టర్-1 : అరుష్ ముక్కర
యూత్ డైరెక్టర్-2: అనీషా కొట్టి
భోర్ద్ ఒఫ్ ట్రుస్తీస్:
ఛైర్మన్ : శ్రీ బాషా షైక్
ట్రస్టీ సబ్యులు:రామచంద్రరావు దుగ్గిన, రాఘవ్ కుమార్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లి
Founders Chairman: హనుమంతాచారి సామాంతపూడి