Movies

వెంకీమామ స్ట్రాటజీ

Venky Mama To Come In December

ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ –టూ అంటూ వచ్చి సంచలన విజయం అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటిస్తున్నాడని తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ రాశీ ఖన్నా ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఉన్నారు. దసరాకి టీజర్ తో సర్ ఫ్రిజ్ చేసిన వెంకీమామ సినిమా ఆ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేలా చేసుకున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో పెద్ద కన్ ఫ్యుషన్ మొదలైంది. అసలైతే ఈ ఈయర్ ఎందింగ్ కల్లా మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కాస్త 2020 సంక్రాంతికి పోస్టు పోన్ అయినట్లు వార్తలు వచ్చాయి. సంక్రాంతి బరిలో మహేష్, అల్లు అర్జున్ సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరుగనుంది. అయిటా రెండింటి మధ్య వచ్చి హిట్ కొట్టడం అంత తేలికైన విషయం కాదు అందుకే వెంకీమామ నిర్మాత సురేష్ బాబు సినిమాను సంక్రాంతికి కాకుండా ముందే రిలీజ్ చేస్తున్నారట. డిసెంబరు 13వ వెంకీమామ సినిమా రిలీజ్ చేస్తున్నారట. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. డిసెంబరు 20న సాయితెజ్ ప్రతిరోజూ పండుగే బాలకృష్ణ రూలర్ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.