Politics

గొల్లపూడికి వెంకయ్య పరామర్శ

Vice President Venkaiah Naidu Visits Gollapudi Marutirao At Chennai-గొల్లపూడికి వెంకయ్య పరామర్శ

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య.. గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.