DailyDose

ప్రభుత్వ సిబ్బందిపై పెట్రోలు పోసిన మరో రైతు-నేరవార్తలు-11/06

Another Farmer Pours Petrol On Govt Officer-Telugu Crime News Roundup Today-11/06

* నరసన్నపేట మండలం డోకులపాడు లో రైతు ఆత్మహత్యాయత్నంరైతు భరోసా లో అన్యాయం జరిగిందని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న అల్లు జగన్మోహన్ రావుపంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులపై పెట్రోల్ చల్లి బెదిరించిన రైతుపోలీసులు అదుపులో రైతు
*టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. దెందులూరుపెదవేగిపెదపాడు పీఎస్‌లలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై చింతమనేనిని పోలీసులు ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు నవంబర్ వ తేదీ వరకు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. పలు పాత కేసుల్లో ఈనెల వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించినట్లు తెలిసింది.
* నరసన్నపేట మండలం డోకులపాడు లో రైతు ఆత్మహత్యాయత్నంరైతు భరోసా లో అన్యాయం జరిగిందని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న అల్లు జగన్మోహన్ రావుపంచాయతీ కార్యదర్శిఇతర అధికారులపై పెట్రోల్ చల్లి బెదిరించిన రైతుపోలీసులు అదుపులో రైతు
* వైష్ణవ శాఖకు చెందిన రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన ఘటన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం పూజా సమయంలో వైష్ణవ భక్తులైన తెంకలై, వడకలై వర్గాల మధ్య శ్లోకాలు జపించడంలో వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.పెరుమాళ్ ఆలయం 8 వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆలయంలో తిరువేది పురం ఉత్సవం నిర్వహించారు. ఆచారం ప్రకారం తెంకలై శాఖ భక్తులు శ్రీ మహా విష్ణువును స్తుతిస్తూ అజ్వర్లు రాసి, పాడిన నలైరా దివ్య ప్రబంధం(4,000 తమిళ శ్లోకాల సంకలనం) పఠించడం ప్రారంభించారు. కానీ వడకలై వర్గం ఇందుకు అభ్యంతరం తెలిపింది. ఆ ప్రబంధాన్ని పఠించడం తమకు వ్యతిరేకమని గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకున్నారు.దీనిపై తెంకలై బృందం.. వడకలై సభ్యులు తమను కిందికి నెట్టారని ఆరోపిస్తూ విష్ణుకాంచీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ ముగిసింది.
* నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైల్వే గేట్ దగ్గర రాస్తారోక్ చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. కార్మికులను పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చకుంటూ వెళ్లడంతో మహిళా కండక్టర్ స్పృహ తప్పి పడిపోయింది.
* థాయిలాండ్‌లో వేర్పాటువాదులు బీభ‌త్సం సృష్టించారు. ఓ సెక్యూర్టీ పాయింట్ వ‌ద్ద కాల్పులు జ‌ర‌ప‌డంతో.. సుమారు 15 మంది చ‌నిపోయారు. యాలా ప్రావిన్సులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో చాలా వ‌ర‌కు పోలీసులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది.
* ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు(SUV) ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాద సంఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. అహ్మదాబాద్ నుంచి జైసల్మేర్‌లోని రామ్‌దేవ్రాకు కారులో వెళుతుండగా భీమన గ్రామం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
*నాగర్‌కర్నూలు జిల్లాలోని పదర మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందారు. పత్తి లోడ్‌తో వెళ్తున్న లారీ, డీసీఎం ఒకదానినొకటి ఢీకొన్నాయి. పత్తి లారీ బోల్తాపడిన దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు.
*నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో రాజు అనే వ్యక్తి చెరువలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక ఘటనలో సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాచలం కాలనీలో ఓ ఇంట్లో కిరణ్(23) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
*కడప జిల్లాతహసీల్దార్ ఎదుట ఆదినారాయణ అనే రైతు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సిబ్బంది ఇతరులు అడ్డుకుని ఆదినారాయణను కాపాడారు. తన భూ సమస్యను పరిష్కరించనందుకే ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లుగా ఆదినారాయణ తెలిపాడు.
*తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం ఏఎస్సై సత్యనారాయణ చౌదరి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నాలుగు భవనాలు, కేజీ బంగారం, వెండి గుర్తించామన్నారు. సత్యనారాయణ చౌదరి కాకినాడ పోర్టు పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఆయన ఇంట్లోనే కాకుండా కాకినాడ, సామర్లకోట, రావులపాలెంలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
*డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. రఘునాథపల్లి మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన సంధ్య(20) అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
*కొద్ది నెలలుగా చేసేందుకు పనుల్లేక, అప్పులు పెరిగి, తీర్చే దారిలేక భవన నిర్మాణ అనుబంధ కార్మికుడొకరు ఉరేసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
*ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయి.. వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా ఇందుకు కారకుడైన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు.
*అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు నొప్పిలేకుండా ఎలా ఆత్మహత్య చేసుకోవాలనే విషయంపై యూట్యూబ్లో వీడియోలు చూసి, బలవన్మరణానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన లెక్కల రామచంద్రుడు(35) నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు.
*రష్యా- చైనా సరిహద్దు సమీపంలో ఓ యువతి నుంచి బంగారం లభించడం కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ యువతి నుంచి రష్యాకు చెందిన సైబీరియా కస్టమ్స్ అధికారులు దాదాపు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*నగర శివారులో దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి కారు డ్రైవర్ గురునాథం ప్రాణాలు కోల్పోయాడు.
*దేశవ్యాప్తంగా సీబీఐ 169చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. రూ.7000కోట్ల విలువ చేసే బ్యాంకు మోసాల కేసుల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటి వరకు 35 కేసులు నమోదైనట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దిల్లీ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రానగర్ హవేలీలోని పలు ప్రాంతాల్లో అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. అయితే బ్యాంకుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. బ్యాంకుల మోసాల విషయంలో సీబీఐ గతంలోనూ దేశవ్యాప్తంగా పలుసార్లు సోదాలు నిర్వహించింది.