DailyDose

సెలవుపై వెళ్ళిన ఎల్వీ-తాజావార్తలు-11/06

AP Ex-CS LV Subrahmanyam Goes On Vacation-Telugu Breaking News-11/06

* అమరావతి- నెలరోజుల పాటు సెలవు పై వెళ్లనున్న మాజీసీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యండిసెంబరు 6 తేదీ వరకూ సెలవు పెట్టిన ఎల్వీ సుబ్రహ్మణ్యంమానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా కొత్తబాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై ఎల్వీ
*ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన నేపధ్యంలో ఆయన బుధవారం సిఎస్ బాధ్యతల నుండి రిలీవ్ అయి ,సిఎస్ బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు.
ఇకపై నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్చార్జి సిఎస్ గా వ్యవహరించనున్నారు
*కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసి) లలో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ అందివ్వాలని ఆదేశించింది . కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ, కర్ణాటకకు నోటీసులు జారీ చేసింది సుప్రీం.
*ఈ నెల 17 వ తేదీ లోపు అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో UP ఫైజాబాద్ పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. వివాదాస్పద ప్రాంతాలపై నిఘా పెంచడమే కాకుండా సోషల్ మీడియా పైనా కన్నేశారు.
*ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై నేటికి 33 రోజులు అవుతుంది. సీఎం కేసీఆర్ ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా కార్మికులు మాత్రం సమ్మె విరమించడం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న కారణంతో ప్రభుత్వం.. కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తుంది. దీన్ని అదునుగా భావించి చాలామంది కాంట్రాక్ట్ కార్మికులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించి ఆర్టీసీ సొమ్మును కాజేస్తున్నారు.
*దేశరాజధాని ఢిల్లీలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పోలీసులకులాయర్లకు మధ్య రాజుకున్న వివాదం చినుకు చినుకు గాలివానగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మద్దతుగా నిలిచారు.
*తెలంగాణ రాష్ర్ట అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
*గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరుగుతున్నా జాతీయ జూనియర్ అద్లేతిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో నాలుగో రోజు రెండు జాతీయ రికార్డులు బద్దలయ్యాయి.
*ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ జోరు కొనసాగిస్తున్నారు. ఆటను మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడటంతో పాకిస్తాన్ తో మూడు టీం 20 సీరీస్లో ఆసీస్ 1-0 ఆధిక్యంతో నిలిచింది.
*ఇంగ్లాండ్ అనూహ్యంగా కుప్పకూలడంతో మంగలావరం మూడో టీం 20లో న్యూజిలాండ్ పద్నాలుగు పరుగులు తేడాతో నెగ్గింది.
*ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణానికి… అడ్డంకులు తొలగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండో దశ అనుమతులు ఇచ్చింది. సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కాగా… ఇప్పటికీ తమకు పూర్తి పరిహారం అందలేదని భూములు కోల్పోయిన రైతులు వాపోతున్నారు.
*రేపల్లె నియోజకవర్గం లోని రేపల్లె అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ కార్యాలయంలో రాత్రి ఏ.సి.బి దాడులు. హాస్టల్ వార్డెన్ దగ్గరనుండి బిల్లులు మంజూరు చేయటం కోసం రేపల్లె ఎ. బి.సి.డబ్ల్యు ఆఫీసర్ షాజహాన్ మరియు అటెండర్ రఫీ ఇద్దరు కలసి 60,000 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎడిషనల్ ఎస్పీ – ఎ.సి.బి గుంటూరు అధికారి సురేష్ బాబు.
*రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఏపీ రీసెర్చ్ సెట్-2019ను ఈనెల 8 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. అనంతపురం, గుంటూరు, హైదరాబాద్, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.
*ఏపీజెన్కో త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్న 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు అవసరాలను తీర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
*ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడిన వారి కుటుంబాలకు రాష్ట్ర కార్మికశాఖ తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జయరాం తెలిపారు.
*స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే జిల్లాల విభజన ప్రక్రియ మొదలుపెడతామని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు.
*ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కళాకారుడు కర్నాటి లక్ష్మీనర్సయ్య(95) మంగళవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు.
*అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనపు డిగ్రీ ఇవ్వాలని వర్సిటీ నిర్ణయించింది. ఉత్తీర్ణత శాతం, విద్యార్థులు ఎంచుకున్న ప్రత్యేక పాఠ్యాంశాలను బట్టే అదనపు డిగ్రీ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి బీటెక్ హానర్స్ లేదా బీటెక్ మైనర్ డిగ్రీ అందచేస్తారు.
*కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) డైరెక్టర్గా తెలుగు వ్యక్తి పీవీకేఆర్ మల్లికార్జునరావు నియమితులు కానున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఆయన కోల్ ఇండియా లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
*ఇంటర్మీడియట్ పరీక్ష రుసుము చెల్లింపునకు ఈ నెల 15 వరకు గడువు పొడిగిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. అపరాధ రుసుము రూ.120తో 22 వరకు అవకాశం కల్పించారు. రూ.5వేలు అపరాధ రుసుముతో జనవరి ఒకటో తేదీ వరకు చెల్లించొచ్చని పేర్కొన్నారు
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ను బేషరతుగా ఉపసంహరించాలని ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏఐడబ్ల్యూజేఏ) డిమాండ్ చేసింది.
*బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ (బీఏపీఏం)అమలులో భాగంగా ‘నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్కు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
*ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేశ్కుమార్ ఈ నెల 8న ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణం చేయించనున్నారు.