ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలిగిపోతున్న టాప్ బ్యూటీ భూమి ఫడ్నేకర్. ఇటీవల ‘సాండ్ కి ఆంఖ్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. ఈ చిత్రంలో భూమి-, తాప్సీ సిస్టర్స్‌గా అద్భుతంగా నటించారు. ఇక భూమి ఫడ్నేకర్ నటించిన ‘పతి పత్ని ఔర్ వో’ అనే చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ ఈ అమ్మడు తన అందచందాలతో మైమరపిస్తోంది. అడల్ట్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పోస్టర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తీక్ ఆర్యన్ భార్య పాత్రలో భూమి నటించింది. ఈ చిత్రానికి ముదస్సార్ అజీజ్ దర్శకత్వం వహించారు. 1978లో వచ్చిన ‘పతి పత్ని ఔర్ వో’ క్లాసిక్ మూవీకి అధికారిక రీమేక్ ఇది.
పెద్దల జోకులో
Related tags :