Devotional

ఋషికేశ్ శివానంద ఆశ్రమంలో ఉచిత యోగా శిక్షణ-TNI ప్రత్యేకం

Free Yoga Training At Sivananda Ashram Divine Life Society In Rishikesh-ఋషికేశ్ శివానంద ఆశ్రమంలో ఉచిత యోగా శిక్షణ-TNI ప్రత్యేకం

ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో సభ్యులు ఉన్న ఋషికేశ్ లోని శివానంద ఆశ్రమాన్ని 1936వ సంవత్సరంలో స్వామీ శివానంద స్థాపించారు. ఈ ఆశ్రమానికి అనుబంధంగా “దివ్యజీవన సంఘం”(THE DIVINE LIFE SOCIETY) స్థాపించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శివానంద స్వామీ శిష్య బృందంలో ఒకరు. అబ్దుల్ కలాం రాసిన THE WINGS OF THE FIRE పుస్తకంలో శివానంద ఆశ్రమం గురించి ప్రస్తావన కూడా ఉంది. ఈ ఆశ్రమానికి అనుబంధంగా యోగా, వేదాంత అకాడమీని ఏర్పాటు చేశారు. సంవత్సరానికి రెండు సార్లు ఈ అకాడమీలో ఉచితంగా యోగా, వేదాంతాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణా కాలం రెండు నెలలు. ఇప్పటి వరకు 93 బ్యాచ్ లకు ఈ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. 94వ శిక్షణా తరగతుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. శిక్షణ సమయంలో భోజన, వసతి సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పిస్తారు. శిక్షణ వచ్చే మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. ఆసక్తి కలిగినవారు తమ దరఖాస్తులను వచ్చే జనవరి 15వ తేదీలోపుగా పంపుకోవాలి. పూర్తి వివరాలకు ఈ క్రింది ఇచ్చిన ప్రకటనను పరిశీలించండి. మరిన్ని వివరాల కోసం ఆశ్రమం ఫోన్ నంబరు 0135-2433541 వెబ్ సైట్ www.dlshq.orgలో చూడవచ్చు. ఈమెయిల్: yvfacademy@gmail.com. ఆసక్తి ఉన్న ప్రవాసాంధ్రులు TNI DIRECTOR KILARU MUDDUKRISHA PHONE NUM:+919440231118లో సంప్రదించవచ్చు.