అయ్యప్ప ఆలయం స్వర్ణ దేవాలయంగా అభివృద్ధి – ఆద్యాత్మిక వార్తలు – 06/11
శబరిమల ఆలయం దినదినప్రవర్ధమానమవుతూ భక్త జనుల్ని పునీతుల్ని చేస్తోంది.చారిత్రకాధారాల ప్రకారం 1935లో తిరువాంకూరు దేవస్థానం ఆలయ నిర్వహణ బాధ్యతల్ని బోర్డువారికి అప్పగించడం జరిగింది. అప్పట్నుంచి అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి. చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడిన తర్వాత పంబా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. 1980 నుంచి దేవస్థానం బోర్డు వారు మరింత శ్రద్ధ తీసుకుని పంబాపై వంతెన, విధ్యుద్దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన కొన్ని షెడ్లు నిర్మించారు. 1984 వరకూ భక్తులు పదునెట్టాంబడిని రాతిమెట్ల మీదుగా ఎక్కేవారు. భక్తులు వెళ్లే పడిని బట్టీ మెట్టుపై కొబ్బరికాయ కొట్టే ఆచారం వచ్చింది. ఆ కారణంగా మెట్లు అరిగిపోవడంతో పాటు కొబ్బరికాయలు వేల సంఖ్యల్లో కొట్టడం వల్ల దారి ఇబ్బందిగా పరిణమించింది. ఈ సమస్యని గుర్తించిన ఆలయ బోర్డు నిర్వాహకులు 1985 లో ఆ ప్రాంతంలో పంచలోహ తంత్రాన్ని మంత్రతంత్రాల్తో ఓ కవచంగా నిర్మించారు. దాంతో 18మెట్లు ఎక్కడం భక్తులకు సులభసాధ్యమైంది. ఎంత రద్దీ పెరిగినా తోపుళ్ళు, తొక్కిసలాటలు జరక్కుండా బోర్డువారు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.అంతేకాకుండ 1982లో ప్లై ఓవర్ బ్రిడ్జి కట్టి దానిపైనుంచి పదునెట్టాంబ డి ఎక్కిన తర్వాత భక్తులు క్యూలో వెళ్ళడానికి తగిన చర్యలు తీసుకున్నారు. కొండపై నుంచి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లై ఓవర్ బ్రిడ్జి కట్టడం వల్ల యాత్రికులకు సౌకర్యం ఏర్పడింది. 1989-90ల మధ్య పంబా మార్గంలో కొంత భాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం సిమెంట్ కాంక్రీట్ చేయడం వల్ల బురద లేకుండా భక్తుల విశ్రాంతికి అనుగుణంగా మారింది. 1985 నుంచి శబరిమలలో పక్కా బిల్డింగ్ లు ఎన్నో నిర్మితమయ్యాయి. దాంతో, ఆధునికత అలముకుంది. బెంగళూరుకు చెందిన భక్తుడొకరు శబరిమల గుడిపైనా, చుట్టూ బంగారు రేకుల్తో తాపడం చేయడానికి పూనుకున్నారు. 2వేల సంవత్సరంలో ఈ తాపడం పని పూర్తవడంతో అయ్యప్ప ఆలయం స్వర్ణ దేవాలయంగా మారింది. శబరిమలలోని వంశపారంపర్య ముఖ్య పూజారిని తాంత్రిగా అభివర్ణిస్తారు. పరుశురాముని పూజ కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో హరిహరుల కలయిక జరిగిన ప్రాంతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ర్యాలీ గ్రామానికి భట్టు రాజుల వంశీయుల్ని తాంత్రీలుగా పనిచేసేందుకు తెసుకెళ్లారని తెలుస్తోంది.
1. తితిదే జేఈవోగా ప్రసాద్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఏఎస్ జేఎస్వీ ప్రసాద్ను నియమించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈవోగా ఉన్న అనిల్కుమార్ సింఘాల్ను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ)గా నియమించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్…. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ)గాను పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నుంచి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు తప్పించి ఆ పోస్టులో సింఘాల్ను నియమించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
2.మందిరంలో ఆయన ‘తితిదే సేవా’ వెబ్సైట్లో శ్రీవాణి ట్రస్టు పోర్టల్ను, దర్శనం స్లాట్ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అక్టోబరు 21 నుంచి నవంబరు 4వ తేదీ వరకు 1109 మం ది భక్తులు రూ.1.10 కోట్లు విరాళమిచ్చి వీఐపీ ప్రివిలేజ్ దర్శనాన్ని పొందారు. రూ.లక్ష పైబడి విరాళాలిచ్చే దాతలకు మాత్రమే లభించే ఈ దర్శనాన్ని, శ్రీవాణి ట్రస్టుకు విరాళమిచ్చినవారికీ వర్తింపజేస్తున్నాం. ఇకపై తితిదే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ చెల్లించవచ్చు. తొలి రోజే ఏడుగురు దాతలు ఆన్లైన్లో సొమ్ము బదిలీ చేసి స్లాట్ తీసుకున్నారు’ అని వెల్లడించారు. ఆన్లైన్లో విరాళాలిచ్చిన భక్తులు 6 నెలల్లోపు దర్శనం చేసుకునేలా స్లాట్ తీసుకోవచ్చన్నారు. శుక్రవారం 200, మిగతా రోజుల్లో 500 మంది భక్తులకు అవకాశం ఉంటుందని వివరించారు.
3. యాదాద్రి స్వర్ణ తాపడం పనులకు శ్రీకారం
యాదాద్రి ప్రధానాలయ ముఖద్వార కవాటాలు, వాటిపై నృసింహుడు, ఇతర దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభం, గోపుర శిఖర కలశాల బంగారు తాపడం పనులు ప్రారంభమ య్యాయి. ఇందుకోసం ఆలయ అధికారులతో ఏర్పాటైన బృందం చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థను సందర్శించి ప్రభుత్వ మింట్లో కరిగించి సిద్ధం చేసిన 16 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని అందజేసింది. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో ఎన్.గీతారెడ్డి, దేవాదాయ శాఖ వజ్రా భరణాల తనిఖీ అధికారి అంజనీదేవి, వైటీడీఏ స్థపతి ఆనందచారి వేలు, దేవస్థానం డీఈఈ మహిపాల్రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు. ఆపై ప్రభు త్వం నియమించిన ప్రత్యేక కమిటీ.. నాణ్యతను తనిఖీ చేయనుంది. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనను ఫిబ్రవరిలో జరిపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినందున స్వర్ణతాపడం పనులను డిసెంబరు 14లోగా పూర్తిచేసేలా లక్ష్యం నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు.
4. 13 నుంచి చినజీయర్ ఆధ్వర్యంలో శ్రీయాగం
రామానుజ జీయర్స్వామి పర్యవేక్షణలో చెన్నైలోని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 18 వరకు పంచాహ్నిక పంచకుండాత్మక సర్వారిష్ట శాంతి, నక్షత్ర గ్రహానుకూలత సిద్ధిప్రద విశ్వశాంతి ‘శ్రీయాగం’ నిర్వహిస్తున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు రవీంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడు ఉమ్మిడి బాలాజీ, సభ్యులు ఆరువేల రమేష్, పీవీఆర్ కృష్ణారావులతో కలిసి మంగళవారం టీనగర్లో జరిగిన కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నైలోని అమింజికరై పూర్వ లక్ష్మీ టాకీసు వద్ద గల అయ్యావు మహాల్లో ఆరురోజుల పాటు చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్, 34 మంది శిష్య బృందం ఆధ్వర్యంలో యాగము జరుగుతుందన్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉంటాయని, విశేష పూజలు, యాగం, ప్రవచనాలు జరుగుతాయన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు పెంచుతూ ప్రశాంతంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. 13న ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య విశ్వక్షేనారాధన, రుత్వికరణ, అంకురార్పణతో యాగం మొదలు. 14న ఆరణి మంథనం, అగ్ని ప్రతిష్ఠ, ప్రవచనాలు, 15 ఉదయం తీర్థగోష్ఠి, 9.30 గంటలకు లక్ష్మీనారాయణ పూజ, 16న మంత్రోపదేశం, ప్రవచనాలు, 17న ఉదయం తీర్థగోష్టి, శ్రీమద్భగవద్గీత 15 అధ్యాయం ప్రవచనం, నిత్యపూర్ణాహుతి, 18న మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, మంగళాశాసనం ఉంటాయని వివరించారు. యువతలో ఆధ్యాత్మిక భావన నింపేలాఈ సందర్భంగా హైందవ పరిరక్షణ కాపాడుకునేలా యువతలో భక్తి భావన నింపేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు తెలిపారు. 16న సాయంత్రం చిన జీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ‘అవర్ఫ్యూచర్ మైవ్యూ’ అన్న అంశంపై నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఆంగ్లంలో ప్రసంగిస్తారన్నారు. ఇందులో 18 నుంచి 25 ఏళ్ల మధ్య యువత పాల్గొంటారని, అందులో ఉత్తమ ప్రతిభ చూపిన 18 మందికి తలా రూ.1000 బహుమతితో సత్కరిస్తామన్నారు. 17న వాల్యూ ఆఫ్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ 2030 పై ప్రసంగం ఉటుందన్నారు. యువతను ఆధ్యాత్మిక భావన దిశగా నడిపించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ హాజరుకానున్నారని పేర్కొన్నారు.
5. పంచాంగం
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు,
తేదీ … 06 – 11 – 2019,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం ),
శ్రీ వికారి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిధి : నవమి ఉ7.40
తదుపరి దశమి,
నక్షత్రం : ధనిష్ఠ ఉ7.33
తదుపరి శతభిషం
యోగం : వృద్ధి ఉ9.53
తదుపరి ధృవం
కరణం : కౌలువ ఉ7.40
తదుపరి తైతుల రా8.39,
వర్జ్యం : మ3.29 – 5.15,
దుర్ముహూర్తం : ఉ11.21 – 12.07,
అమృతకాలం : రా2.04 – 3.50,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండం. : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.04,
సూర్యాస్తమయం : 5.25,
6. నేటిమాట-మనసు పై అదుపు
మనస్సు చాల విచిత్ర మైనది, మనస్సు కు చంచలత్వం సహజ గుణం కావడం చేత, నిరంతర సాధన అవసరం.
సాధన లేకపోతే మనస్సు మలినమైన ఆలోచనలతో నిండిపోతుంది.
దానికొక చిన్న ఉదాహరణ :
ఒకచోట వివాహం జరుగుతుంటే ఒక పెద్ద మనిషి ప్రవేశించి, అందరిపైన అజమాయిషీ చెలాయించడం మొదలు పెడతాడు.
అతడు మగ పెళ్ళి వారి బంధువేమోనని ఆడ పెళ్ళి వారు, ఆడ పెళ్ళి వారి బంధువేమోనని మగ పెళ్ళి వారు భావించి అతనిని గౌరవిస్తూ వస్తారు. పెళ్ళి పూర్తి అయ్యాక ఇరు వర్గాల వారు తీరికగా కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో …ఈ పెద్ద మనిషి ప్రస్థావన వస్తుంది. తనగుట్టు రట్టు కాబోతున్న దని గ్రహించి అతనక్కడినుండి చల్లగా జారుకుంటాడు…అదే విధంగా, మన మనస్సుయొక్క ప్రవర్తనను మనము జాగ్రత్తగా గమనిస్తే అది కూడా ఆ పెద్ద మనిషి లాగే మాయ మౌతుంది…గనుక మన మనస్సుపై మనము అదుపు సాధించాలి…
7. రాశిఫలం -06/11/2019
తిథి:
శుద్ధ నవమి ఉ.7.11 , కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
ధనిష్ఠ ఉ.7.01
వర్జ్యం:
మ.3.05 నుండి 4.50 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు
మే:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుంటాయ. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
సింహం:
(ఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతన వస్తు, వస్త్ర, వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఋణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా వుంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలేర్పడే అవకాశముంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుంటాయ. కొత్త పనులను ప్రారంభించుట మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా వుంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ధనలాభముంది. అద్భుతమైన అవకాశాలు లభిస్తాయ. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి వుంటుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని పనులు ఈ రోజు పూర్తిచేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
8. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,451 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
9. తిరుమల సమాచారంఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం 06-11-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…
శ్రీవారి దర్శనానికి 1 కంపార్ట్ మెంటులో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది….
కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది…..
నిన్న నవంబర్ 5 న 64,451 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3 కోట్లు…తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారంమరిన్ని విశేషాలకుhttp://www.edukondalu.com/
10. రిత్రలో ఈ రోజు/నవంబర్ 6
1860: అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనికార్మికులతో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు. ఆయనకు 9నెలల జైలుశిక్ష వేశారు.
1923: వారానికి ఐదు రోజులతో రష్యా ప్రయోగాత్మక కాలమాన పద్ధతిని ప్రవేశపెట్టింది.
1937 : భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం.
1941: నౌఖాలీ ఊచకోత జరిగిన ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు.
1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు.
11. ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట మండలం కేటీ అన్నారంలో నూతన ఆంజనేయ స్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. దేవాలయాల్లో షొడశోపచార పూజ విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పని సరి అన్నారు. ఏ దేవాలయానికైనా ధ్వజస్తంభం ఉంటేనే ఆలయత్వం ఉంటుందన్నారు. ఆలయాల్లో మూల విరాట్టు పట్ల ఎంత భక్తితో ఉంటామో ధ్వజస్తంభం పట్ల కూడా అలాగే ఉండాలన్నారు. ధ్వజ స్తంభ ప్రతిష్ట వంటి కార్యక్రమాలతో గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియడంతో పాటు, ప్రజల్లో ఐక్యత పెరుగుతుందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు..
12. కాలుష్యం ఎఫెక్ట్.. దేవుని విగ్రహాలకూ మాస్క్
ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ దేవుడి విగ్రహాల మీద కూడా పడింది. వారణాసిలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో భగవంతుడి విగ్రహాలకూ మాస్క్‌లు పెడుతున్నారు. వాటి వల్ల దేవుడిని వాయు కాలుష్యం నుంచి రక్షించినవాళ్లం అవుతామని అక్కడి భక్తులు చెబుతున్నారు. దీపావళి తరువాత దిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో వారణాసి ప్రజలు ముఖాలకు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో దేవుని విగ్రహాలు కూడా చేరాయి.
వారణాసిలోని సిగర్ పరిధిలోని కాశీ విశ్వవిద్యాలయం సమీపంలోని శివపార్వతి మందిరంలోని విగ్రహాలకు అక్కడి పూజారి, భక్తులు మాస్క్‌లను తొడిగారు.ఈ సందర్భంగా పూజారి హరీశ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఇక్కడి వారంతా దేవుడిని మానవ రూపంలో కొలుస్తారు. అందుకే వేసవిలో వేడి నుంచి కాపాడటానికి విగ్రహాలకు చందనం రాస్తాం. చలి నుంచి రక్షించడానికి కంబళ్లు, స్వెట్టర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు కాలుష్యం బారి నుంచి కాపాడటానికి మాస్క్‌లు వేశాం’ అంటూ వివరించారు.
13. యాదాద్రిలో కార్తీక పూజల కోలాహలం
యాదాద్రిలో కార్తీక పూజల కోలాహలం కొనసాగుతున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్రంలో సత్యదేవుని వ్రతాలు ఎక్కువగా ఆచరించే యాదాద్రి నరసింహుని గత పూజలతో కొలిస్తే తమకు శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. దాంతో కార్తీకమాసంలో యాదాద్రిలో సత్యనారాయణ స్వామివారి వ్రతం పూజలు ఆచరించడం ఏడాదికేడాది పెరుగుతుంది. తిరువీధులలో భక్తుల సందడి నెలకొంది.
14. వేములవాడ ఆలయంలో నాగుపాము
రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ ప్రధాన ఆలయానికి ఉపాలయంగా ఉన్న.. శ్రీ లక్ష్మీనారసింహ స్వామి కొలువైన నాంపల్లి గుట్టపై మంగళవారం నడిరాత్రి నాగుపాము వచ్చింది. గుట్ట మెట్ల దగ్గర దాదాపు గంటపాటు పడగవిప్పి ఉంది. కార్తీక మాసం కావడంతో నాగుపాము గుడిదగ్గరకు వచ్చిందని భక్తులు నమ్ముతున్నారు. గుడ్డపై ఉన్న కాళీయమర్ధనం అనే చోటనే నాగుపాము వచ్చింది. కుక్కలు పామును చూసి మొరుగుతున్నా పాము అక్కడే ఉండిపోయింది. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారే కొలువయ్యారని మొక్కారు. మరికొంత మంది అక్కడే కొబ్బరికాయలు కొట్టారు. కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకున్న తర్వాత.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితి.
అయ్యప్ప ఆలయం స్వర్ణదేవాలయంగా అభివృద్ధి
Related tags :